»   » ప్రమాదం కాదా? తనీష్ తండ్రి మరణంపై అనుమానాలు!

ప్రమాదం కాదా? తనీష్ తండ్రి మరణంపై అనుమానాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తెలుగు నటుడు తనీష్‌ తండ్రి వర్థన్‌ ప్రమాదవశాత్తూ మంగళవారం అర్దరాత్రి మరణించిన సంగతి తెలిసిందే.తనీష్‌ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న మణికొండలోని వెస్టర్న్‌ ప్లాజాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

తొలుత ఇది ప్రమాదం అని భావించినప్పటికీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. వర్దన్ మరణం ప్రమాద వశాత్తు జరిగింది కాదని, ఆత్మహత్య అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Many doubts on Tanish's father death

వర్ధన్ కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, చాలా అప్పులు ఉన్నాయని, ఈ కారణంతోనే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పలు ఆస్తుల్ని అమ్మి అప్పుల్ని తీర్చినట్లు చర్చించుకుంటున్నారు.

అయితే ఆత్మహత్య అనడానికి ఆధారాలు ఏమీ లేవు. సూసైడ్ నోట్ లాంటిది కూడా ఏమీ దొరకలేదు. దీంతో పోలీసులు దీన్ని ఆత్మహత్యగా కాకుండా ప్రమాద వశాత్తు జరిగిన సంఘటన కిందనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

English summary
Many doubts on Tanish's father Vardhan death. Tanish's father was said to be facing huge financial problems. Some people it is suicide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu