Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి దిశ మారింది.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్

Meenakshi Chaudhary: టాలీవుడ్ బ్యూటీ , హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఆమె సొంతం. ఈ అమ్మడు తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈ భామ.. తన అందాలతో సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది. అనతీకాలంలోనే టాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తూ బిబీబిజీగా మారింది ఈ క్యూట్ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడానికి సిద్దమవుతోంది. ఇంతకీ ఆ విశేషాలేంటీ ?

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ మీనాక్షి చౌదరి హర్యానా వాసీ, ఈ నార్త్ బ్యూటీ మొదట పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకున్నప్పటికీ, నటిగా మారి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించింది. 'ఇచట వాహనాలు నిలుపరాదు'తో తెలుగులో పరిచయం అయిన మీనాక్షి.. హిట్-2, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులనందు తనదైన ప్రత్యేక గుర్తింపు పొందింది. ముఖ్యంగా 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో 2025 సంక్రాంతి పండుగలో పెద్ద హిట్ సాధిస్తూ, టాలీవుడ్‌లో బ్యాక్-టు-బ్యాక్ విజయాలను అందుకుంటూ కొనసాగుతోంది.

Meenakshi Chaudhary Cast as Lead in John Abraham Action Thriller Force 3

ప్రస్తుతం మీనాక్షి తెలుగులో నవీన్ పొలిశెట్టి సరసన 'అనగనగా ఒక రాజు' చిత్రంలో నాయికగా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ అవ్వనుంది. ఇలా టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు సరికొత్త యాక్షన్ హీరోయిన్‌గా కనిపించనున్నదట. బాలీవుడ్‌ స్టార్ హీరో జాన్ అబ్రహం హీరోగా రూపొందిన యాక్షన్-థ్రిల్లర్ సిరీస్ 'ఫోర్స్'కి సీక్వెల్ 'ఫోర్స్ 3'లో కథానాయికగా మీనాక్షి చౌదరి ఎంపికైన విషయం చర్చనీయాంశమైంది.

'ఫోర్స్ 3'ఈ మూవీకి భవ్ ధూలియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 'ఫోర్స్', 'ఫోర్స్ 2' చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో, ఈ సీక్వెల్‌లో మీనాక్షి కూడా యాక్షన్ ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించబోతోంది. ఈ పాత్ర కోసం ఆమె కొన్ని ప్రత్యేక వర్క్‌షాప్స్‌లో కూడా పాల్గొనబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో తన ప్రతిభను నిరూపించిన తర్వాత, బాలీవుడ్‌లో హిందీ ప్రేక్షకుల ముందు తన సత్తా చూపించడానికి రెడీ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్, స్టంట్ వర్క్‌లలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ, 'ఫోర్స్ 3' ద్వారా తన యాక్షన్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఫుల్ స్పెక్ట్రంలో నటిగా అడుగు పెడుతూ, మీనాక్షి చౌదరి బాక్సాఫీస్ పరంగా మంచి విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: meenakshi force john abraham
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X