»   » జక్కన్న ఇదేం బాగాలేదు.. మెగా ఫ్యాన్స్ ఫైర్!

జక్కన్న ఇదేం బాగాలేదు.. మెగా ఫ్యాన్స్ ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకొన్న ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారట. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తి భారీగా ప్రచారం నిర్వహించడమే అందుకు కారణమట.

సంక్రాంతి రేసులో నువ్వా నేనా అనేటట్టు చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడిన సంగతి తెలిసిందే. ఖైదీ నంబర్ 150, శాతకర్ణి చిత్రాల విడుదలకు ముందే మెగా, నందమూరి అనుకూల, ప్రతికూల వర్గాలు వాగ్భాణాలు సంధించుకోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో శాతకర్ణి చిత్రాన్ని రాజమౌళి ఆకాశానికి ఎత్తేయడాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట.

SS Rajamouli

ఒకవేళ శాతకర్ణి నచ్చితే మాత్రం పనిగట్టుకొని ట్వీట్స్ చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడమేంటనే వాదనను వినిపిస్తున్నట్టు సమాచారం. మగధీర చిత్రం సందర్భంగా మెగా ఫ్యామిలీతో తలెత్తిన విభేదాల వల్లనే రాజమౌళి అలా చేశాడని అభిమానులు వాపోతున్నట్టు తెలిసింది.

క్రిష్ తో ఫ్రెండ్లీ రిలేషన్, శాతకర్ణిని పంపిణీ చేసిన సాయి కొర్రపాటితో ఉన్న అనుబంధం వల్లనే అలా స్పందించాల్సి వచ్చిందని రాజమౌళి వర్గం వివరణ ఇచ్చినా మెగా ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారడం లేదట. ఈ పరిస్థితుల్లో మెగా అభిమానుల వైఖరిపై జక్కన ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

English summary
Mega Fans Furious over SS Rajamouli Tweets on Gautamiputra Shatakarni
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu