For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగబాబు కొడుకు ప్రక్కన హీరోయిన్ గా ఆ హీరో కూతురు

  By Srikanya
  |

  హైదరాబాద్ : మెగా క్యాంప్ నుంచి వస్తున్న మరో హీరో వరుణ్ తేజ్ అని తెలిసిందే. నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ ని శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే గొల్లభామ అనే టైటిల్ కూడా అనుకున్నారు. మరి వరుణ్ తేజ్ ప్రక్కన హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారనేదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. కమల్ హాసన్ రెండో కూతురు అక్షరను ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు జంటగా చేయించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆమెకు ఇప్పటికే తమిళ,హిందీ పరిశ్రమల నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమె ఓకే చెయ్యలేదు. కానీ మెగా క్యాంప్ హీరో కావటంతో ఓకే చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.

  రీసెంట్ గా జరిగిన సిసిఎల్ 3 లో చెన్నై రైనోస్ జట్టుకు మద్దతు ఇవ్వటానికి తన అక్కతో పాటు ఆమె మైదానంలోకి వచ్చి అందరి దృష్టిలో పడింది.
  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నారు. ఆయన కొత్త చిత్రానికి 'గొల్లభామ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. శ్రీకాంత్ అడ్డాల తన తర్వాతి సినిమా నాగబాబు తనయుడు వరుణ్ తేజతో చేయబోతేన్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడనుంది.

  తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం అయితేనే బెటరని నాగబాబు బలంగా నమ్ముతున్నాడని, వరుణ్ తేజ కోసం మంచి కథ రెడీ చేయమని అతన్ని పురమాయించాడని టాక్. గీతా ఆర్ట్స్ బేనర్ పై ఈచిత్రం రూపొందే అవకాశం ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ నటనతో పాటు, సినిమాకుల సంబంధించిన విషయాలపై శిక్షణ తీసుకుంటున్నాడు.

  వాస్తవానికి 2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో తన తనయుడికి కూడా సెంటిమెంటు పని చేస్తుందని నాగాబాబు ఆశ పడుతున్నాడని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

  English summary
  Nagababu’s son Varun Tej is all set to debut in tinsel town this year. They say that successful director Srikanth Addala who has panache in making sensible family entertainers is roped for the job. But the big thing is about the girl who should share space with Varun. Some say that talks are on with Kamal Haasan’s younger director Akshara Haasan, who is yet to take a decision about career in films. If everything goes well, this star-kid will debut in Tollywood like her star-sister Shruti, who is running high after a Mega hero’s touch.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X