200కోట్ల ప్రాపర్టీని అమ్మకానికి పెట్టిన జీవిత రాజశేఖర్.. డీల్‌ క్లోజ్ చేసేందుకు సిద్దమైన మెగా హీరో సతీమణి!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినీ తారలు పైకి అంతగా కనిపించకపోయినా ఆర్థికంగా బ్యాక్ గ్రౌండ్ లో చాలా పవర్ఫుల్ గా ఉంటారు. ఒక విధంగా పైకి చూపించుకోవాడానికి వాళ్ళు అంతగా ఇష్టపడరు. ఇక అలాంటి వారిలో జీవిత రాజశేఖర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వారి ఖరీదైన ప్రాపర్టీని అమ్మకానికి పెట్టగా మెగా హీరో సతీమణి డీల్ క్లోజ్ చేసేందుకు సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి.

Recommended Video

MAA Election : Jeevita Rajasekhar Vs Prakash Raj Vs Manchu Vishnu| Triangular Fight|Filmibeat Telugu
ఒకప్పుడు సాలీడ్ రెమ్యునరేషన్

ఒకప్పుడు సాలీడ్ రెమ్యునరేషన్

హీరో రాజశేఖర్ ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ అందుకున్నారు. అప్పట్లో ఆయన కూడా సాలీడ్ రెమ్యునరేషన్ తీసుకున్నవారే. ఇక జీవిత కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించారు. ఇక ఇద్దరు ఒకటైన తరువాత వారి ఆస్తులు కూడా మిక్స్ అయ్యాయి. అనంతరం కొన్ని సినిమాలను సొంత బ్యానర్ లోనే నిర్మించారు.

సినిమాల నిర్మాణంతో.. నష్టాలు

సినిమాల నిర్మాణంతో.. నష్టాలు

ఆప్తుడు, ఎవడైతే నాకేంటి, మహంకాళి వంటి సినిమాలను నిర్మించి డైరెక్ట్ చేసిన జీవిత ఆ సినిమాలతో అప్పట్లో కొంత నష్టపోయినట్లు టాక్ వచ్చింది. అనంతరం ఆమె సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కొనసాగుతు వస్తున్నారు. ఇక రాజశేఖర్ టాలీవుడ్ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఖరీదైన ప్రాపర్టీని అమ్మకానికి పెట్టిన జీవిత

ఖరీదైన ప్రాపర్టీని అమ్మకానికి పెట్టిన జీవిత

అయితే చాలా రోజుల అనంతరం జీవిత రాజశేఖర్ లకు సంబంధించిన ఒక ఖరీదైన ప్రాపర్టీని అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఫిల్మ్ నగర్ లో గత కొన్నేళ్లుగా ఒక ప్రాపర్టీని రెంట్ కు ఇచ్చి నెలకు కొంత ఆదాయాన్ని అందుకుంటున్న జీవిత రాజశేఖర్ ఇప్పుడు దాన్ని అమ్మకానికి సిద్ధం చేయగా మెగా హీరో సతీమణి కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

రంగంలోకి మెగా కోడలు

రంగంలోకి మెగా కోడలు

ఆ మెగా హీరోయిన్ మరెవరో కాదు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. జీవిత రాజశేఖర్ ఆస్తిని సొంతం చేసుకోవడానికి ఉపాసన ఆసక్తి చూపుతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. మంచి ఆఫర్ తో డీల్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ ఆస్తిలో ఫీనిక్స్ గ్రూప్ అనే మరో కంపెనీకి కూడా వాటా ఉన్నట్లు తెలుస్తోంది.

దాని ఖరీదు.. 200కోట్లు

దాని ఖరీదు.. 200కోట్లు

ఇక ఆ ప్రాపర్టీలో జీవిత రాజశేఖర్ ఆస్తి వాటా దాదాపు 200కోట్ల వరకు ఉంటుందని టాక్. ఇప్పుడు ఈ స్థలంలో నివసిస్తున్న కొంత అద్దెదారులు ఖాళీ చేయవలసి ఉంది. ఈ ఆస్తి పక్కన ఫీనిక్స్ గ్రూప్ ఒక మెగా ప్రాజెక్ట్ ను కూడా అభివృద్ధి చేసింది. హారిక హాసిని చినాబాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్దవాళ్ళు అందులో ప్రాపర్టీస్ కొన్నట్లు సమాచారం. ఇక ఈ డీలింగ్ పై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X