RC 15: ఆ హీరో వలన రామ్ చరణ్ సినిమా మరింత ఆలస్యం.. ఈ ఏడాది కూడా లేనట్లే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత ఒక్కసారిగా తన స్టార్ హోదాను ఫ్యాన్ ఇండియా లెవెల్ లో పెంచేసుకున్నాడు. అతనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ఇప్పుడు నేషనల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గుర్తింపును అందుకోవడంతో రామ్ చరణ్ క్రేజ్ కూడా మరింత పెరుగుతోంది.

అయితే రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత ఆచార్య సినిమాతో మళ్ళీ ఒక్కసారిగా నిరాశపరిచాడు. ఆ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే మరో లెవెల్లో ఉండేది. అయితే ఫ్యాన్స్ ఎదురుచూపులు మాత్రం ఒకే ఒక్క సినిమాపై ఎక్కువగా ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ యాక్షన్ ఫిలింగా రాబోతున్న ఈ సినిమాలో ఎన్నో సామాజిక అంశాలు హైలెట్ అవుతాయని ఇదివరకే ఒక టాక్ వినిపించింది.

Mega power star Ram charan 15th movie new release date plans changes

తప్పకుండా శంకర్ రామ్ చరణ్ ను అద్భుతంగా ప్రజెంట్ చేయగలడు అని ఫాన్స్ లో ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. అయితే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సింది. కానీ అనుకోకుండా శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ కావడం వలన వాయిదా వేసుకున్నారు. అయితే కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాను ఈ ఏడాది సమ్మర్ చివరలో విడుదల చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. అందుకే శంకర్ ను ఏమాత్రం విడిచిపెట్టడం లేదు.

దీంతో శంకర్ రామ్ చరణ్ తోను అలాగే నిర్మాత దిల్ రాజుతో కూడా మరోసారి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శంకర్ ఎక్కువ స్థాయిలో ఇండియన్ 2 ఫోకస్ పెడితే మాత్రం రాంచరణ్ సినిమా ఈ ఏడాది కూడా రాకపోవచ్చు అని తెలుస్తోంది. కుదిరితే 2023 చివరలో డిసెంబర్ లో విడుదల చేయవచ్చు. లేదంటే 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X