»   » చిక్కుల్లో చిరు ‘కత్తి’ రీమేక్: సహాయనిరాకరణ..వెనక దాసరి?

చిక్కుల్లో చిరు ‘కత్తి’ రీమేక్: సహాయనిరాకరణ..వెనక దాసరి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :చూస్తూంటే చిరంజీవి కత్తి రీమేక్ వివాదంలో ఇరుక్కునేటట్లు ఉంది. అది పెద్ద ఇష్యూ కాకపోయినా ఒక అడ్డంకిగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు డైరక్టర్స్ అశోశియేషన్ వారు సహాయనిరాకరణ చేయమని పిలుపు ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్.నరసింహరావు అనే రచయిత,డైరక్షన్ డిపార్టెమెంట్ కు చెందిన వ్యక్తి తను తెలుగు సినీ రైటర్స్ అశోసియేషన్ లో రిజిస్టర్ చేసిన కథను మురగదాస్ ..కత్తి కథ ఒకటే అని కంప్లైంట్ చేసారు.

తమిళంలో ఈ వివాదం ఇలాగే ఉండిపోయనా తెలుగులో మాత్రం ఈ వివాదమే రీమేక్ కు అడ్డంకిగా మారేటట్లు కనపడుతోంది. ఇందుకోసం ఓ ఫోరమ్ ని ఏర్పాటు చేసి ఇష్యాని సాల్వ్ చేయాలనుకున్నారు.

కధా హక్కుల వేదిక ఛైర్ పర్శన్ గా దాసరి నారాయణరావు గారు ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఈ వివాదం తేలేవరకూ కత్తి చిత్రాన్ని ఏ నిర్మాతా తెలుగులో రీమేక్ చేయరాదన్నారు. ముఖ్యంగా కత్తి నిర్మాతలు..రచయిత నరసింహరావు కు కాంపన్షషన్ చెల్లించి ముందుకు వెళ్లాలన్నారు.

అయితే కత్తి రీమేక్...పనులు..ఈ కాంపన్షన్ ఇవ్వకుండా జరుగిపోతున్నాయి. నరసింహరావుతో సెటిల్ మెంట్ చేసుకోలేదు. దాంతో ఈ మ్యాటర్ ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ పరిధిలోకి వచ్చింది. మరో ప్రక్కన తెలుగు ఫిల్మ్ డైరక్టర్స్ అశోశియేషన్ వారు ..ఈ సినిమాకు ఏ విధంగానూ సహకరించకూడదని ప్రకటించారు.

Mega Star Chiranjeevi faces ‘Kaththi’ problems

చిరంజీవి పునరాగమనం 'బ్రూస్లీ'తోనే ఖాయమైపోయింది. తనయుడు రామ్‌ చరణ్‌ నటిస్తున్న ఈ చిత్రంలో చిరు అతిథి పాత్రలో కనిపించారు. 'నాన్న 150వ చిత్రానికి ఇది టీజర్‌' అని చరణ్‌ అభిమానులకు చెప్పాడు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అసలు సినిమా సిద్ధమవుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం 'కత్తి'. విజయ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకుడు. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయనున్నారు. వివి వినాయిక్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.

చిరంజీవి, వినాయక్‌, మధు కలయికలో ఇదివరకు 'ఠాగూర్‌' వచ్చింది. మురుగదాస్‌ తమిళంలో తీసిన 'రమణ'కి రీమేక్‌ అది. ఇప్పుడు మళ్లీ మురుగదాస్‌ కథతోనే ఈ ముగ్గురూ జట్టుకడుతుండటం విశేషం. చిరంజీవి ఇమేజ్‌, శైలికి తగ్గుట్టు తెలుగులో మార్పులు చేస్తున్నారట. ఈ నెలలోనే చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారట.

English summary
Telugu Film Directors' Association has already called for non co-operation to Katthi’s remake film. Katthi#sthash.Q2tZ1DYW.dpuf
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu