చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. ఆరు పదుల వయసు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలకు దీటుగా యాక్షన్ సినిమాలో నటిస్తూ అలరిస్తున్నారు. ఎవరి తరహాలో వారు తెలుగు ప్రేక్షకులను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత జోరుగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి చిత్రాలకు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రియల్ లైఫ్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. సమయం ఉన్నప్పుడల్లా ఒకరి ఇంటికి మరొకరు వెళ్తూ, తమ కెరియర్లో జరిగిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ కనిపిస్తూనే ఉన్నారు. మరి ఇద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకున్న హీరోలు ప్రస్తుతం యంగ్ టాలెంట్స్ ని ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. యంగ్ దర్శకులతోను కూడా వారు కలిసి పని చేస్తూ బ్లాక్ బస్టర్ సినిమాలను తెరపైకి తీసుకు వస్తున్నారు.

Megastar Chiranjeevi Akkineni Nagarjuna Missed 2 Multi Starrer films

అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఒక రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. గతంలో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో మల్టీ స్టారర్ చిత్రాలు రూపుదిద్దుకోవాల్సి ఉండింది. ఒక చిత్రం చర్చల్లోనే ఆగిపోయింది. ఇక మరో చిత్రం షూటింగ్ ప్రారంభం చేసుకుని కొన్ని కారణాల వల్ల షెడ్డు కి వెళ్ళింది. ఇంతకీ ఆ రెండు చిత్రాలు ఏమిటి, ఎందుకు ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మిస్ అయింది అనే వివరాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఆ విషయాలను సినీ ప్రముఖులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

1990లో టాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మెగాస్టార్ చిరంజీవితో అల్లుడా మజాకా అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక నెక్స్ట్ అక్కినేని నాగార్జునతో హలో బ్రదర్ అనే మరో బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలు సక్సెస్ కావడంతో చిరంజీవి నాగార్జున కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. కానీ ఆ చిత్రం చర్చల్లోనే ముగిసిపోయింది.

ఇక రెండవసారి టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరు నాగ్ తో మల్టీస్టారర్ తెరకెక్కించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కథను కూడా సిద్ధం చేసి షూటింగ్ కూడా ప్రారంభించారు. ఇద్దరికీ కథ నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నారు. హీరోయిన్గా సౌందర్యను కూడా ఎంపిక చేశారు. ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమై 10 శాతం వరకు కీలక సన్నివేశాలను పూర్తిచేసుకుంది. కానీ ఆ తర్వాత సినిమా కథ పూర్తిగా చిరంజీవికి సరిపోయేలా లేదని కే రాఘవేంద్ర రావే నిలిపివేశారు. ఈ విషయంలో నాగార్జున కూడా వారి అభిప్రాయాలను అంగీకరించారు. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో రావలసిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిలిమ్స్ మిస్ అయ్యాయి. ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఏదైనా ఉందా అని ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X