Just In
- just now
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్ఫండ్?'
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా డబుల్ ధమాకా.. ఆ ప్రాజెక్ట్ లేనట్లే?
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 65వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న మెగాస్టార్ ని చూస్తుంటే ఇంకా పాతికేళ్ల యువ కెరటంలానే ఉన్నారని అనిపిస్తోంది. 151 సినిమాలు చేసినప్పటికీ ఇంకా అదే స్పీడ్ లో వెళుతున్నారు. ఇక నెక్స్ట్ ఆయన నుంచి రాబోయే సినిమాలపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
అయితే మెగాస్టార్ పుట్టినరోజున ఎలాంటి అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒక్కటి కూడా విడుదల చేయలేదు.

ఇక మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా రిలీజ్ చేస్తారేమో అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక మరో కొత్త సినిమాకు సంబంధించిన స్పెషల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జై లవకుశ, వెంకీ మామ దర్శకుడు బాబీ మెగాస్టార్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా ఆ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు. కానీ అఫీషియల్ గా ఒక ఎనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక గత కొన్ని నెలలుగా లూసిఫర్ అప్డేట్ ఇస్తారేమో అని ఓ వర్గం అభిమానులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. స్క్రిప్ట్ అనుకున్నట్లుగా సెట్టయితే బర్త్ డే సందర్భంగా ఎనౌన్స్ చేయాలని మెగాస్టార్ అనుకున్నారు. కానీ దర్శకుడు సుజిత్ అనుకున్నట్లుగా సెట్ చేయకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ని కొన్నాళ్ళు పక్కనపెడితే బెటర్ అని మెగాస్టార్ ఫిక్స్ అయినట్లు సమాచారం.