twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూమరా..నిజమా : చిరంజీవి 500 కోట్లు ఇన్విస్టమెంట్ గురించే అంతటా రచ్చ

    మెగాస్టార్ చిరంజీవి, ఆయన కొడుకు రామ్ చరణ్.. కోడలు ఉపాసనలు.. తమ స్థలాలు-పొలాలు-బిల్డింగ్స్ వంటి కొన్ని ఫిక్సెడ్ అసెట్స్ ను కరిగించేసి దాదాపు రూ.500 కోట్లను డబ్బుని బయటకు తెచ్చారట.

    By Srikanya
    |

    హైదరాబాద్: సినిమా న్యూస్ లంటే ఇప్పుడు ఫలనా హీరో దగ్గర ఇంత బ్లాక్ ఉందంటా..ఫలానా హీరోయిన్ వైట్ చేసుకుంటోందిట. మరో నిర్మాత నోట్ల రద్దుతో చాలా నష్టపోయాడట ..ఇలా ఇదే టాపిక్ లు గత పదిహేను రోజులుగా నడుస్తున్నాయి. ఎందుంటే అంతలా మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అనే నిర్ణయం అన్ని రంగాలపై ప్రభావం చూపించింది.

    చిరంజీవి-పవన్ కళ్యాణ్ దత్తన్న కూతురు పెళ్లి వేడుకలో (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

    ఈ నేపద్యంలో మెగాస్టార్ చిరంజీవి మీద కూడా నిన్నటి నుంచీ ఓ చిన్న రూమర్ మొదైలంది. చిరంజీవి మీద కదా..అది నిజమో కాదా అనేది ప్రక్కన పెట్టి, జనాలు మాట్లాడుకోవటం మొదలెట్టారు. అంటే రూమర్స్ కూడా ఎవరిమీద పడితే వాళ్ల మీద వస్తే జనం పట్టించుకోరు కదా. ఇంతకీ ఆ రూమర్ మ్యాటర్ ఏంటి అంటారా...

    ఇలాంటి గడ్డు పరిస్దితుల్లో మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబం కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారట. ఆయన కొడుకు రామ్ చరణ్.. కోడలు ఉపాసనలు.. తమ స్థలాలు-పొలాలు-బిల్డింగ్స్ వంటి కొన్ని ఫిక్సెడ్ అసెట్స్ ను కరిగించేసి దాదాపు రూ.500 కోట్లను డబ్బుని బయటకు తెచ్చారట. ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి ఊపిరి పీల్చుకున్నారన్నది ఆ గాసిప్ సారాంశం.

    Megastar Chiranjeevi invested in Mutual Funds?

    వాస్తవానికి ...స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ అయిన సెబీ అండర్ లో నిఘా ఉండే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్స్ అంటే.. రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో ఫిక్సెడ్ అసెట్స్ కంటే లాంగ్ టెర్మ్ లో వీటిలో రిటర్న్స్ బాగా వస్తాయన్నది మార్కెట్ వర్గాలలో వినపడుతోంది. దాంతో ఇలా 500 కోట్లను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుంటుంది మెగా ఫ్యామిలీ అంటున్నారు.

    ఇక ఆ డబ్బు అంతా వైట్ మనీ అని..కాబట్టి ఎవరూ క్వచ్చిన్ చేసే అవసరం ఉండదంటున్నారు. ఈ విషయంలో నిజా నిజాలు ఎంతవరకూ ఉన్నాయనేది ప్రక్కన పెడితే మన తెలుగులో ఏ స్టార్ కూడా ఇప్పటివరకూ అపీషియల్ గా స్టాక్ మార్కెట్ లోకి వచ్చి ఇన్వెస్ట్ చేసింది లేదు. కాబట్టి ఇది మెగా రికార్డే.

    Megastar Chiranjeevi invested in Mutual Funds?

    ఇక మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెం 150' షూటింగ్ రీసెంట్ గా సెంట్రల్ యూరఫ్ లోని క్రోయేషియా, స్లోవేనియాలో జరుగింది. ఇక్కడ చిత్ర హీరో చిరంజీవి, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మీద పాటల చిత్రీకరణ చేసారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు.

    English summary
    Chiranjeevi is heard melting out his fixed assets like properties and agricultural lands and now investing the same in Mutual Funds.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X