ప్రభాస్ దర్శకుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. అతని స్థానంలో వివి.వినాయక్?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత సినిమాల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆయన నెలల పాటు చర్చలు జరుపుతున్నారు. మెగాస్టార్ తో సిట్టింగ్ వేస్తే దర్శకుడి నుంచి మంచి కంటెంట్ వచ్చేలా చేస్తారు. అయితే ఒక దర్శకుడు మాత్రం మెగాస్టార్ అంచనాలను అందుకోలేదని టాక్ వస్తోంది. ఇక చివరికి అతని స్థానంలో సీనియర్ డైరెక్టర్ చేరినట్లు తెలుస్తోంది.

అంతకంటే హై రేంజ్ లో ఉండాలని..

అంతకంటే హై రేంజ్ లో ఉండాలని..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తప్పకుండా ఆ సినిమా కమర్షియల్ హిట్ గా నిలుస్తుందని మెగాస్టార్ నమ్మకంతో ఉన్నారు. ఇక ఆ తరువాత వచ్చే సినిమా కూడా అంతకంటే హై రేంజ్ లో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

రీమేక్ అంటే కష్టమే..

రీమేక్ అంటే కష్టమే..

మెగాస్టార్ కోసం తనయుడు రామ్ చరణ్ మళయాళం లూసిఫర్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ తెలుగులో డబ్బింగ్ అయిన ఆ సినిమాను తెలుగులో సరికొత్తగా తెరకెక్కించాలి అంటే సాధారణమైన విషయం కాదు. కేవలం కథలో మెయిన్ పాయింట్ ని తీసుకొని అభిమానులకు ఒక కొత్త ఆలోచనను కలిగించేలా తీయాలి. లేకపోతే మొదటికె మోసం వస్తుంది.

ఎన్నిసార్లు ఆలోచించినా..

ఎన్నిసార్లు ఆలోచించినా..

ఆ రీమేక్ కోసం మెగాస్టార్ ఏరికోరి ప్రభాస్ సాహో దర్శకుడిని ఎంచుకున్నాడు. సుజిత్ కి పిలిచిమరి అవకాశం ఇవ్వగా సుజిత్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. చాలా సార్లు మెగాస్టార్ సుజిత్ రాసుకున్న కథపై చర్చలు జరిపాడు. ఎన్నిసార్లు ఆలోచించినా కూడా స్క్రిప్ట్ నమ్మకంగా అనిపించకపోవడంతో మెగాస్టార్ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.

వివి.వినాయక్ చేతిలో మరో రీమేక్

వివి.వినాయక్ చేతిలో మరో రీమేక్

ఇక ఇప్పటికే ఆలస్యం అయ్యిందని లూసిఫర్ రీమేక్ బాధ్యతలను వివి.వినాయక్ కి అప్పజెప్పే ప్లాన్ లో ఉన్నారట మెగాస్టార్. వినాయిక్ తో ఇదివరకే ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. కమర్షియల్ ఎలిమెంట్స్ తో వినాయక్ తప్పకుండా లూసిఫర్ రీమేక్ కి న్యాయం చేయగలడు అని మెగాస్టార్ రామ్ చరణ్ కి చెప్పినట్లు టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X