»   »  మెగా వారసుడు వరుణ్ తేజ లాంచింగ్ డేట్..వెన్యూ

మెగా వారసుడు వరుణ్ తేజ లాంచింగ్ డేట్..వెన్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మరో మెగా వారసుడు ...నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ తొలి చిత్రం పట్టాలు ఎక్కే రోజు దగ్గరకు వచ్చేసింది. ఫిభ్రవరి 27న అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీ పెద్దల సమక్షంలో చిరంజీవి క్లాప్ తో ఈ చిత్రం ప్రారంభం కానుంది. మెగా కుటుంబం మొత్తం హాజరుకానున్న ఈ చిత్రం టైటిల్ గొల్లభామ. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. నల్లమలుపు బుజ్జి,ఠాగుర్ మధు జాయింట్ గా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అక్షర గౌడ నటించనుంది.

'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనదైన ముద్ర తెలుగు తెరపై వేసి ఆకట్టుకొన్నాడీ దర్శకుడు. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో తొలి అడుగులు వేయించేందుకు సిద్ధమవుతున్నాడు.ఈ చిత్రానికి ఠాగూర్‌ మధు, నల్లమలపు శ్రీనివాస్‌ నిర్మాతలు. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. 2014 జనవరి 1న ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి.

Megastar claps on Varun Tej

ప్రస్తుతం వరుణ్ తేజ్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన క్వాలిటీస్‌ను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడట.

English summary
Naga Babu's son Varun Tej's debut film Golla Bhama is all set to hit the floors soon. As per the latest buzz the film makers are planning to launch the film on 27th, February at Annapurna Studios and Mega Star Chiranjeevi may give first clap for this film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu