Just In
- 13 min ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 50 min ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
- 54 min ago
సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న విజయ్ దేవరకొండ.. నెంబర్ వన్!
- 1 hr ago
చెడ్డి దోస్తాన్ వాల్యూ చూపించిన రామ్ చరణ్.. యువ హీరోకు సడన్ సర్ ప్రైజ్
Don't Miss!
- News
రైతుల ఆందోళనకు 100రోజులు ... నల్లజెండాలతో నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులు
- Sports
ఆ సమయంలో పంత్ స్కూప్ షాట్.. ఎవరైనా ఇలా ఆడగలరా అంటూ మాజీల ఆశ్చర్యం వీడియో
- Automobiles
కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ టీజర్; త్వరలో భారత్‌లో విడుదల - వివరాలు
- Finance
గుడ్‌న్యూస్: క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఆలోచిస్తున్నాం..నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాక్ ఆఫ్ ది టౌన్: సరిలేరు ఫంక్షన్‌కు చిరంజీవి రావడానికి కారణం ఎన్టీఆర్ డైరెక్టరే.!
సూపర్ స్టార్ మహేశ్ బాబు మాంచి జోష్ మీద ఉన్నాడు. ఆయన నటించిన గత రెండు చిత్రాలు సూపర్ హిట్ అవడంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. వాటిని అందుకునేందుకు చిత్ర యూనిట్ ఎంతో పట్టుదలతో పని చేస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు మెగాస్టార్ చిరంజీవి సాయం తీసుకున్నారు. ఆయన ఇటీవల జరిగిన ఫంక్షన్‌కు హాజరవడంతో చిత్ర యూనిట్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇంతకీ ఆయన ఈ ఫంక్షన్‌కు రావడానికి కారణం ఎవరో తెలుసా.?

సరిలేరు నీకెవ్వరు వెనుక ఉన్నది వీళ్లే
అనిల్ రావిపూడి - మహేశ్ బాబు కలయికలో వస్తున్న చిత్రమే ‘సరిలేరు నీకెవ్వరు'. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేశ్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, లేడీ అమితాబ్ విజయశాంతి, బండ్ల గణేష్, సంగీత, హరితేజ, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఒక్కటి కాదు.. అన్నింటికీ భారీ రెస్పాన్స్
ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్నో అప్‌డేట్స్ ఇస్తోంది సరిలేరు నీకెవ్వరు యూనిట్. ఇప్పటి వరకు ఈ సినిమాలోని పాటలతో పాటు, టీజర్, ట్రైలర్ విడుదలయ్యాయి. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని కొన్ని పాటలైతే రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఆ రెండింటి మిశ్రమమే సరిలేరు నీకెవ్వరు
ఈ మధ్య సీరియస్ మూవీస్ చేసిన మహేశ్.. ఈ సినిమాలో అదిరిపోయే కామెడీని పండించనున్నాడు. ఫస్టాఫ్ మొత్తం అదే తరహాగా సినిమా సాగనుంది. ఇక, రెండో భాగంలో సీరియస్ మోడ్‌లోకి వెళ్తోందట. ఈ రెండింటి కలయికతో సరిలేరు నీకెవ్వరు రూపొందిందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక, ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఈ అంశాలు చూపించారు.

సరిలేరు యూనిట్‌లో కొత్త ఉత్సాహం
సంక్రాంతి కానుకగా రానున్న సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసేసింది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ఎంట్రీతో ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అవడంతో.. చిత్ర యూనిట్‌లో కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది.

చిరు రావడానికి కారణం ఆయనే
సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి హాజరు కావడం వెనుక మహేశ్ బాబు సన్నిహితుడు, టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఉన్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. చిరంజీవికి దగ్గరి బంధువు అయిన ఆయన.. అందరి కంటే ముందుగా వెళ్లి ఫంక్షన్‌కు ఆహ్వానించారట. దీనికి ఆయన ఓకే చెప్పడంతో చిత్ర యూనిట్ మర్యాదపూర్వకంగా కలిసిందని సమాచారం.

నాలుగు సినిమాలు.. అన్నీ ఫ్లాప్‌లే
మెహర్ రమేశ్ తెలుగులో నాలుగు సినిమాలను తెరకెక్కించాడు. అందులో జూనియర్ ఎన్టీఆర్‌తోనే రెండు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. అప్పటి నుంచి దర్శకత్వానికి దూరంగా ఉంటున్న రమేశ్.. మహేశ్ బాబు కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఈ క్రమంలోనే పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.