»   » పాపం శ్రీను వైట్ల.. మిస్టర్ వివాదం క్లోజ్.. నష్టాల చెల్లింపుకు ఒకే..

పాపం శ్రీను వైట్ల.. మిస్టర్ వివాదం క్లోజ్.. నష్టాల చెల్లింపుకు ఒకే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అగ్రహీరోలకు వరుస బ్లాక్‌బస్టర్లను అందిస్తూ అగ్రదర్శకుడిగా దూసుకుపోయారు శ్రీనువైట్ల. ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లు వెక్కిరించడంతో రేసులో వెనుకపడ్డాడు. అయితే తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ చిత్రం ఆయనకు నిరాశను మిగిల్చింది. ఆ చిత్రం భారీ నష్టాల్లో కూరుకూపోవడంతో ఆయన ఆ నష్టాల్ని కొంత భరించాల్సి వచ్చింది. అయితే ఆ అంశంపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో కొందరు టాలీవుడ్ పెద్దలు మధ్యవర్తిత్వం వహించి వివాదాన్ని పరిష్కరించినట్టు సమాచారం.

85 లక్షలు ఇవ్వడానికి సరే..

85 లక్షలు ఇవ్వడానికి సరే..

శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా 'మిస్టర్' చిత్రం రూపొందింది. మిస్టర్ ఊహించని విధంగా భారీగా నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆ నష్టాలను శ్రీను వైట్ల షేర్ చేసుకోవాలనే వివాదం గత కొంతకాలంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం రూ.85 లక్షలు ఇవ్వడానికి శ్రీను వైట్ల అంగీకరించడంతో ఈ వివాదం ముగిసినట్టు తెలుస్తున్నది.

మిస్టర్‌తో ఊహించని నష్టాలు

మిస్టర్‌తో ఊహించని నష్టాలు

వాస్తవానికి 'మిస్టర్' నిర్మాతలకు భారీ ఎత్తున నష్టాలను మిగిల్చింది. ప్రస్తుతం శ్రీను వైట్ల ఇవ్వడానికి అంగీకరించిన రూ.85లక్షల మొత్తం ఏమాత్రం పూడ్చేది కాదని సమాచారం. ఈ చిత్రం కోసం శ్రీను వైట్ల రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా చిత్రాన్ని రూపొందించినట్టు ఫిలింనగర్‌లో వార్తలు అప్పట్లో వినిపించాయి.

దర్శకులకు గుణపాఠం

దర్శకులకు గుణపాఠం

తాజా వివాదంపై టాలీవుడ్‌ ప్రముఖులు తలో విధంగా స్పందించినట్టు తెలిసింది. నిర్మాతలను విచ్చలవిడిగా ఖర్చు పెట్టించిన దర్శకులకు శ్రీను వైట్ల ఉదంతం ఓ గుణపాఠం అని ఓ వర్గం వాదన. దర్శకులు బ్లాక్ బస్టర్లు అందించినప్పుడు అధికంగా పారితోషికంగానీ, లాభాలు గానీ చెల్లించరే అని మరొకొందరు వాదన వినిపిస్తున్నారు.

 రజనీకీ చేదు అనుభవం

రజనీకీ చేదు అనుభవం

సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల ఆర్థిక అంశాలపై వివాదాలు నెలకొనడం టాలీవుడ్ గానీ, ఇతర సినీ పరిశ్రమలకు కొత్తేమీ కాదు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కొచ్చడయాన్, లింగ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో వివాదాలు కోర్టు వరకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.

 శ్రీను వైట్లకు రవితేజ ఛాన్స్

శ్రీను వైట్లకు రవితేజ ఛాన్స్

ఇక ఈ వివాదం పక్కన పెడితే, ప్రస్తుతం రవితేజ నటించే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం శ్రీను వైట్ల ముంగిట నిలిచింది. టాలీవుడ్‌లో హీరోగా సుస్థిర స్థానం కల్పించిన దర్శకుల్లో శ్రీను వైట్ల ముఖ్యుడు. దానిని గుర్తు పెట్టుకొని తన స్నేహితుడు శ్రీను వైట్లకు సహకారం అందించడం గమనార్హం.

English summary
Now Tollywood directo Srinu Vaitla is in deep trouble. Recently his movies were failed to hit the box office. Varun Tej's Mister Movie is one among that. Prior commitment, Srinu Vaitla is willing to settle the amount Rs. 80 lakhs. Apart from this, Srinu Vaitla is going to test his fate with Ravi Teja movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu