Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వరుణ్ సందేశ్‌కి మోహన్ బాబు వార్నింగ్?
హైదరాబాద్ : మంచు ఫ్యామిలీ హీరోలంతా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీలో హీరో వరుణ్ సందేశ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల మోహన్ బాబు వరుణ్ సందేశ్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఈ చిత్రం షూటింగు బ్యాంకాక్‌లో జరుగుతుండగా హీరో వరుణ్ సందేశ్ అక్కడి బార్లో ఓ థాయ్ అమ్మాయి పట్ల మిస్ బిహేవ్ చేసాడని, దీంతో ఆమె మనుషులు వచ్చి వరుణ్ ను కొట్టారని, విషయం అక్కడి పోలీసుల వరకు వెళ్లిందని, మనోజ్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయడంతో విషయం సద్దుమనిగిందని వార్తలు వెలువడ్డాయి.
వరుణ్ సందేశ్ చేసిన ఘనకార్యంపై మోహన్ సీరియస్ అయ్యారని, పరాయి దేశంలో తెలుగువాళ్ల పరువు తీసే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏమిటని మందలించడంతో పాటు, మరోసారి ఇలాంటివి జరిగితే తీవ్రపరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన వరుణ్ సందేశ్‌కు తర్వాత ఒకటి అరా తప్ప అన్నీ ప్లాపులే. ఇటు పర్సనల్ లైఫ్ లో కూడా వరుణ్ సందేశ్ చుట్టూ ఇప్పటికే అనేక వివాదాలు ఉన్నాయి. ఇలా అయితే పరిశ్రమలో ఉండటం కష్టమే అంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు.