»   » యమ ధర్మరాజుగా మరోసారి మోహన్ బాబు

యమ ధర్మరాజుగా మరోసారి మోహన్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రం యమ దొంగ లో యముడుగా నటించి మెప్పించిన మోహన్ బాబు మరోసారి యముడుగా కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. 1994లో మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం 'యమలీల'. ఎస్వీకృష్టాడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందిరికి తెలిసిందే. ఈ చిత్రం సీక్వెల్ లో ఆయన యమధర్మరాజు గా కనిపించనున్నారు. జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.


అలీ కెరీర్‌లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు త్వరలో సీక్వెల్‌ను రూపొందించాలన్న ప్రయత్నాల్లో దర్శకుడు ఎస్వీకృష్టాడ్డి ఉన్నట్టు తెలిసింది. 'యమలీల 2' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో యమధర్మరాజు పాత్రలో ప్రముఖ నటుడు మోహన్‌బాబు నటించనున్నారని, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని దర్శకుడు ఎస్వీకృష్టాడ్డి త్వరలో ప్రకటించనున్నారని చిత్ర వర్గాల సమాచారం. అయితే హీరో ఎవరన్నది ఖరారు కాలేదు.

Mohan babu in Yamaleela Sequel

ఇక మోహన్ బాబు నిర్మిస్తునవ్న ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' లో మోహన్ బాబు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రొడక్షన్ హౌస్ నుంచి అందిన సమాచారం. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. దాదాపు పది సంవత్సరాల అనంతరం మోహన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కావడంతో 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టైటిల్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. బ్రహ్మానందం, ఎంఎస్.నారాయణ, అలీ, రఘుబాబు, గుర్లిన్ చోప్రా, అలేఖ్యవర్మ, తెలంగాణ శకుంతల, గిరిబాబు, పోసాని కృష్ణ మురళి, కాశీ విశ్వనథ్, కృష్ణ భగవాన్, సుప్రీత్, భరణి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు.

English summary
Now it was heard that SV Krishna reddy is keen to take forward the sequel to ‘Yamaleela’If everything goes as planned, the film might start shooting in January. In the earlier version, Ali and Indraja played the lead roles. Now, it is being said that the director has already roped in Collection king Mohan Babu to portray King of Death ‘Yamudu’A new actor might carry forward the role that was enacted by Ali while characters like Chitragupta and Thota Ramudu will be enacted by the original actors –Brahmanandam and Tanikella Bharani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu