»   » సెట్ అవుతారా? : ‘మనం’ మళయాళంలో రీమేక్...మెయిన్ క్యారక్టర్స్ లో వీళ్ళే

సెట్ అవుతారా? : ‘మనం’ మళయాళంలో రీమేక్...మెయిన్ క్యారక్టర్స్ లో వీళ్ళే

Posted By:
Subscribe to Filmibeat Telugu


కొచ్చి : అక్కినేని మూడు తరాల నటులు ఒకే తెరపై కనిపించిన చిత్రం 'మనం'. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కినేని అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకులెవరూ మర్చిపోలేని సినిమా మనం.

తెలుగు సినిమా లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చివరి చిత్రం కావటంతో తెలుగు ప్రేక్షకులకు చాలా స్పెషల్. తెలుగు ప్రేక్షకులకే కాక, నాగార్జున కెరీర్ ను కూడా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిందీ సినిమా. ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేస్తారని, చాలా భారీ బడ్జెట్ గా తెరకెక్కిస్తారని ప్రచారం జరిగి, ఆగిపోయింది.

ఆ తర్వాత తమిళ హీరో సూర్య కుటుంబం తో ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలని అనుకున్నప్పటికీ అది జరగలేదని, దాని స్థానంలో సూర్య తో 24 చిత్రాన్ని పూర్తి చేసినట్లు విక్రమ్ కుమార్ పేర్కొన్నారు.

అయితే ఇప్పుడు 'మనం' మళయాళంలో రీమేక్ అయ్యే అవకాసం ఉందని సమాచారం. ఈ మేరకు రీసెంట్ గా టాక్స్ జరిగాయని ఫిల్మ్ నగర్ టాక్. ఈ నేపధ్యంలో మనం సినిమాలో ఏ పాత్రలకు ఏ మళయాళి నటుడు సెట్ అవుతారనే విషయమై చర్చ మొదలైంది.

ముమ్మట్టిని నాగ్ పాత్రకు

ముమ్మట్టిని నాగ్ పాత్రకు

ఈ చిత్రంలో నాగేశ్వర్ పాత్రలో కనిపించిన నాగార్జున హైలెట్ గా నిలిచారు. ఆ పాత్రకు మళయాళంలో చేస్తే ముమ్మట్టి అయితే ఫెరఫెక్ట్ గా సెట్ అవుతారని అంటోంది అక్కడి మీడియా. కోటీశ్వరుడు పాత్రలో ముమ్మట్టి అదరకొడ్తారని అంటున్నారు.

పెద్దాయన పాత్రకు

పెద్దాయన పాత్రకు

సినిమాలో కీలకంగా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావు పాత్ర చైతన్య కోసం..మళయాళ నటుడు మధు అయితే ఫెరఫెక్ట్ గా సరిపోతాడంటున్నారు. నాగేశ్వర్, అంజలి పాత్రలను కలిపే అక్కినేని పాత్రలో ఆయన అద్బుతంగా ఉంటాడంటున్నారు.

నాగచైతన్య పాత్రకు

నాగచైతన్య పాత్రకు

ఒక జన్మ లో వర్కో హాలిక్ గా ఉండి తన భార్యను నిర్లక్ష్యం చేసి, రెండో జన్మలో ...కాలేజ్ స్టూడెంట్ గా..లవ్ స్టోరీ నడుపుతాడు. ఆ పాత్రలో దుల్కర్ కనపడితే బాగుంటుందని ఆయన అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా దుల్కర్ ...ముమ్మట్టి కుమారుడు అవటం కలిసి వచ్చే అంశం.

సమంత పాత్రకు

సమంత పాత్రకు

మనం సినిమాలో సమంత పాత్ర కూడా కీలకమై నిలిచింది. భిన్నమైన షేడ్స్ తో నడిచే ఆ పాత్ర సినిమాకు హైలెట్ అయ్యింది. ఈ పాత్రకు నిత్యామీనన్ అయితే బాగుంటుందంటున్నారు. నిత్యామీనన్, దుల్కర్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుండటమే కాకుండా...ఆమె మెచ్యూర్ నటన కూడా సినిమాకు ప్లస్ అవుతుందని చెప్తున్నారు.

శ్రియ పాత్ర

శ్రియ పాత్ర

సినిమాలో నాగార్జున కు జోడిగా కనిపించిన శ్రియ పాత్ర కు మళయాళి నటి మమతామోహన్ దాస్ అయితే ఫెరఫెక్ట్ సూట్ అవుతుందని చెప్తున్నారు. 1920 లో కనపించి విలేజ్ అమ్మాయిగానూ, డాక్టర్ అంజలిగా ఈ కాలం పాత్రలోనూ ఆమె కనిపిస్తే బాగుంటుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

ప్రణవ్ మోహన్ లాల్

ప్రణవ్ మోహన్ లాల్

చివర్లో మెరిసిన అఖిల్ పాత్రకు గానూ..మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ ని ఎంచుకుంటే అద్బుతంగా ఉంటుందని చెప్తున్నారు. అంతకు మించిన బెస్ట్ ఛాయిస్ ఉండదంటున్నారు. ఎందుకంటే త్వరలో భారీ ఎత్తున ప్రణవ్ మోహన్ లాల్ లాంచింగ్ జరగనుంది. మోహన్ లాల్ అభిమానులంతా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.

అందుకే చేయలేదు

అందుకే చేయలేదు

సూర్య కజిన్ అయిన నిర్మాత జ్నానవేల్ రాజాకు ‘మనం' సినిమా బాగా నచ్చేసి.. సూర్య ఫ్యామిలీతో ఆ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై సూర్య స్పందిస్తూ.. ‘‘మనం రీమేక్ చేయాలన్న ఆలోచన నాకు కూడా కలిగింది. జ్నానవేల్ ఆ విషయమే విక్రమ్ తో మాట్లాడాడు. ఐతే విక్రమ్‌కు అది ఇష్టం లేదు. తర్వాత నాకు కూడా ‘మనం'ను మళ్లీ తీయడానికి మనసొప్పలేదు. '' అని సూర్య చెప్పాడు.

సాయికుమార్ తో..

సాయికుమార్ తో..

"మనం"ని కన్నడలో కూడా రీమేక్ చేసే ప్రయత్నం నటుడు ,డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ కుటుంబం చేయాలని ప్రయత్నం చేసింది. అక్కినేని కుటుంబం లాగే, సాయుకుమార్ కుటుంబం కూడా అరుదైన నేపధ్యాన్ని సొంతం చేసుకుంది. సాయికుమార్ తండ్రి పి.జె.శర్మ నటులుగా మాత్రమే కాక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, రచయితగా సినీ ప్రేక్షకులకు సుపరిచితులే. సాయికుమార్ తన విలక్షమైన నటన, డైలాగ్ డెలివరీతో ఎన్నో విభిన్న పాత్రల్లో వెండితెరపై మెరిశారు. తాత, తండ్రి బాటలోనే వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు సాయుకుమార్ కుమారుడు ఆది. అయితే ఊహించని విధంగా పిజె శర్మ మృతి చెందటంతో ఈ ప్రయత్నం మానుకున్నారు.

హమ్ టైటిల్ తో

హమ్ టైటిల్ తో

'మనం' చిత్రానికి లభిస్తున్న ఆదరణ చూసిన మీదట ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించిన రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ హిందీ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసారు. తెలుగులో దీనికి దర్శకత్వం వహించిన విక్రంకుమార్ హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తాడన్నారు. 'హమ్' పేరిట రూపొందే ఈ చిత్రంలో నటించడానికి అమితాబ్ బచ్చన్ ముందుకి వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఏఎన్నార్ పాత్రలో ఆయన కనిపిస్తాడనీ, నాగార్జున, నాగచైతన్య పాత్రల్లో వరుసగా అమీర్ ఖాన్, రణభీర్ కపూర్ నటిస్తారని అన్నారు. అయితే ఈ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు.

మీ అభిప్రాయాలు...

మీ అభిప్రాయాలు...

మళయాళంలో ఈ చిత్రాన్ని పైన చెప్పిన కాస్టింగ్ చేస్తే వర్కవుట్ అవుతుందా...అసలు నప్పుతారా..రీమేక్ అనేది ఈ చిత్రానికి కరెక్టేనా ..కాదా మీ అభిప్రాయాలను క్రింద కామెంట్స్ కాలంలో పంచుకోండి.

English summary
Who will replace Akkineni Nageswara Rao, Akkineni Nagarjuna, and Nagachaitanya, if Telugu blockbuster Manam is remade in Malayalam?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu