»   » రాజేంద్రప్రసాద్‌కు షాక్: ‘మా’ బరిలో మురళీ మోహన్, జయసుధ

రాజేంద్రప్రసాద్‌కు షాక్: ‘మా’ బరిలో మురళీ మోహన్, జయసుధ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(MAA) ప్రెసిడెంట్ పదవి కోసం నటకిరీటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోటీ బరిలో మధ్యలో మంచు విష్ణు పేరు కూడా వినబడింది. అయితే తను పోటీ చేయడం లేదని విష్ణు స్వయంగా తెలిపాడు. ఇక రాజేంద్రుడి ఏకగ్రీవం ఖాయం అనుకున్నారు.

కానీ తాజాగా మురళీ మోహన్ పోటీకి దిగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు నటి జయసుధ కూడా మా అద్యక్ష పదవి కోసం పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలో ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే నిజమైతే ‘మా' ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారనున్నాయి. గతంలో ఓసారి రాజేంద్రప్రసాద్ ‘మా' ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరీ ఈసారి ‘మా' ప్రెసిడెంట్ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

Murali Mohan Shock to Rajendra Prasad

ఈ నెల 29న మా కార్యవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు మురళీ మోహన్ కొనసాగుతున్నారు. ఇటీవల ప్రెస్ మీట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పిన రాజేంద్రప్రసాద్.... ఒకవేళ మా అధ్యక్ష పదవికి పోటీ ఉన్నా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న మురళీ మోహన్ స్థానం ఖాళీ అయితే కొత్త వ్యక్తి రావాలని పలువురు ఆర్టిస్టులు కోరుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్ మా అధ్యక్ష పదవికి అన్ని విధాలా అర్హుడని పలువురు ఆర్టిస్టులు అభిప్రాయ పడుతున్నారు.

రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఆయన పండించే హాస్యం తెలుగు సినిమా ను ప్రపంచస్థాయికి తీసుకెల్లింది. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెల్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్ర్ఫిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెఛ్ఛిపెట్టాయి. వయసు పైబడ్డాక ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. వయసు పైబడ్డాక ‘ఆ నలుగురు', ‘ఓనమాలు' లాంటి మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

English summary
The election story of Movie Artists Association (MAA) President post is nothing less than a Tollywood thriller. Rajendra Prasad's bubble was bursted by the incumbent President Murali Mohan who is completing his tenure soon. Those in the know say the actor turned politician has decided to contest in the election again provided if Rajendra Prasad is in race for the top spot.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu