»   » చిరు సినిమా ఇలాగా తీసేది... ఆ సీన్లు నాకు నచ్చలేదు: మురుగదాస్

చిరు సినిమా ఇలాగా తీసేది... ఆ సీన్లు నాకు నచ్చలేదు: మురుగదాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకు మూలం తమిళ సినిమా 'కత్తి'. ఆ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించినవాడు స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌.కత్తి సినిమాకు కత్తిలాంటి స్క్రిప్ట్ సమకూర్చింది డైరక్టర్ మురుగదాస్. కత్తి సినిమాకు కమర్షియల్ హంగులతో పాటు, మంచి పొటెన్షియాలిటీ, ఎమోషనల్ కేలిబిర్ తో కూడిన స్క్రిప్ట్ ను అందించాడు అతను. ప్రస్తుతం ఆయన మహేష్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పనుల నిమిత్తం ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నాడు.

'ఖైదీ నెంబర్‌ 150' సినిమాను తొలిరోజే హైదరాబాద్‌లో చూశాడు. సినిమా అంతా బాగానే ఉన్నప్పటికీ కొన్ని సీన్లు చూసి ఫీలయ్యాడట మురుగ‌దాస్‌. తమిళంలో తీసిన 'కత్తి' సినిమా కథే మూలంగా వి.వి వినాయ‌క్ ఈ సినిమాను తీశాడు. అయితే, ఈ సినిమా చూసిన మురుగ‌దాస్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడ‌ట‌. అందుకు మంచి కార‌ణ‌మే ఉంది. ఈ సినిమా చూసిన అనంత‌రం ఆయ‌న స్పందిస్తూ.. సినిమా అంతా బాగానే ఉందని అన్నాడు. అందులో క‌నిపించిన‌ కొన్ని సీన్లపై మాత్రం అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు.

ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో ఓ కామెడీ ట్రాక్ ఉంటుంది. అది ఆయ‌నను ఫీల‌య్యేలా చేసింద‌ట‌. ఇంత‌కీ మేటర్ ఏంటంటే.. మురుగదాస్‌కి లిక్క‌ర్ అంటేనే గిట్ట‌దు. దాదాపు ఆయ‌న డైర‌క్ట్ చేసే సినిమాల‌లో అలాంటి సీన్స్‌లో లేకుండా చూసుకుంటాడ‌ట మురుగ‌దాస్‌. మందు తాగేవాడే కృరంగా ఆలోచిస్తాడనీ, తాగటం ఒక రఫ్ నెస్ కి రూపం అని ఒప్పుకోని మురుగదాస్ హీరో గానీ, విలన్ గానీ అసలు తన సినిమాలోని ఏ క్యారెక్టర్ కూడా మందు ముట్టదు.

Murugadoss

అంత పక్కాగా మధ్య నిషేదాన్ని అమలు చేస్తాడు మురుగదాస్ . త‌మిళ్ క‌త్తి మూవీలోనూ విల‌న్ గ్రీన్ టీ తాగుతున్న‌ట్లు చూపించాడు మురుగదాస్‌. కానీ, ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో ఏకంగా ఓ కామెడీ ట్రాక్ మొత్తం లిక్క‌ర్ సెంట‌ర్‌గానే న‌డ‌వ‌డం ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టింద‌ట‌. ఈ సీన్ హీరోకి, క‌మెడియ‌న్‌కి మ‌ధ్య సాగుతుంది. దీనిని చూసిన మురుగ‌దాస్‌.. ఇదేంటి.. ఇలా చేశారు..? అని త‌న చుట్టుప‌క్క‌న ఉన్న వారితో త‌న అభిప్రాయం షేర్ చేసుకున్న‌ట్టు స‌మాచారం.

సాధారణంగా మురుగదాస్‌ సినిమాలో ఆల్కహాల్‌ సీన్లు దాదాపుగా ఉండవు. ఆయన సినిమాల్లో విలన్‌ కూడా టీ, కాఫీలే తాగుతాడు. అలాంటిది ఈ రీమేక్‌ సినిమాలో హీరోయే లిక్కర్‌ సీన్లు చేయడం మురుగదాస్‌కు నచ్చలేదట. అలాగే అలీకి ఆడవేషం వేసి సృష్టించిన కామెడీ కూడా ఆయనకు సంతృప్తి కలిగించలేదట. అవి మినహా సినిమా బాగుందని, చిరంజీవి మాత్రం అద్భుతంగా చేశారని మురుగదాస్‌ తన సన్నిహితుల వద్ద అన్నాడట.

English summary
Khaidee 150's original Katti in tamil Director Muruga Das feels irritated with two khaidi 150 scenes
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu