For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వీళ్లను ఏం చేద్దాం? పవన్ ఫ్యాన్స్ గురించి మహేష్ కత్తి మరో పోస్ట్!

  By Bojja Kumar
  |

  సినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మహేష్ కత్తి.... పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య రగులుతున్న వివాదం ఇంకా సద్దుమనగలేదు. పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి ఆయనకు వేధింపులకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఆయన వాటికి ధీటుగా రిప్లై ఇస్తూనే ఉన్నారు.

  ఈ పరిణామాల నేపథ్యంలో మహేష్ కత్తి ఫేస్ బుక్ లో మరో సంచలన పోస్టు చేశారు. తనతో పాటు, తనకు మద్దతు తెలిపిన వారిని కూడా పవన్ ఫ్యాన్స్ వేధిస్తున్నారని ఆయన తన ఫేస్ బుక్ పోస్టు ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

  నేను తగ్గాను, వాళ్లే తగ్గడం లేదు

  నేను తగ్గాను, వాళ్లే తగ్గడం లేదు

  ఈ వివాదంలో నేను త‌గ్గినా పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు త‌గ్గ‌డం లేదు. ఇది ఇలాగే కొన‌సాగితే జ‌రిగే ప‌రిణామాల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కొంత‌మంది అభిమానులు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది అని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు.

  మీ ఇష్టం

  మీ ఇష్టం

  వీళ్ల‌ను ఇలాగే వ‌దిలేయాలా? లేక ఏదైనా చ‌ర్య తీసుకోవాలా?... మీ ఇష్టం అంటూ మహేష్ కత్తి తన మద్దతు దారులను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

  ఇటీవల స్పందించిన పవన్

  ఇటీవల స్పందించిన పవన్

  పవన్ కళ్యాన్ ఇటీవల జనసేన డిజిటల్ వింగ్ సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా స‌భ్యులు అడిగిన‌ పలు ప్రశ్నలకు ప‌వ‌న్ సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా మహేష్ కత్తి ఇష్యూపై ప‌వ‌న్ పరోక్షంగా స్పందించారు.

  ఇరిటేట్ అవుతారు ఎందుకో

  ఇరిటేట్ అవుతారు ఎందుకో

  నేనెప్పుడూ నా సినిమాల గురించి ట్వీట్ చేయను....నేను నా సినిమాల వంద రోజుల వేడుకలు చేసుకోను. ఎందుకంటే అందరికీ దెబ్బలు తగులుతాయి...నలిగిపోతారని బాధ. అందుకే ఇలాంటివి నేను చేయ‌ను అని అన్నారు. ఎవరికైనా సరే బలంగా ఒక గొంతు, ఒక వాదన ఉన్నప్పుడు వాళ్లు ఇరిటేట్ అవుతారు ఎందుకో.. మనం వాళ్లకు ఎవరేం చేయక్కర్లేదు. నేను సినిమాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు కూడా కొంతమంది విమర్శించారు... అని పవన్ వ్యాఖ్యానించారు.

  నేనేమీ బంగారం కాదుకదా

  నేనేమీ బంగారం కాదుకదా

  రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటివి జరుగుతాయని నాకు తెలుసు. నన్ను తిట్టేవాళ్లు ఉంటారు.. మెచ్చుకునే వాళ్లు కూడా ఉంటారు.. సపోర్ట్ చేసే వాళ్లు ఉంటారు. ఇవన్నీ భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది నా పర్సనల్ కాదు. కానీ రాజకీయాలకు వచ్చినప్పుడు జనం మధ్యలోకి వెళ్తాను. ఇబ్బందులుంటాయి. నేను కొంద‌రికి న‌చ్చుతాను..కొంద‌రికి న‌చ్చ‌ను...నేనేమి బంగారాన్ని క‌దుక‌దా.... అని పవన్ కళ్యాణ్ అన్నారు.

  ఎవరినీ ద్వేషించను

  ఎవరినీ ద్వేషించను

  ఒక మనిషి నవ్వడానికి చాలా తక్కువ కండరాలు కదలాలంట. అదే ఇతరులను ద్వేషించాలంటే శరీరం అంతా రక్తం కలుషితం అయిపోతుంది. వాళ్ల ముఖ కండరాలు పాడైపోతాయి. మొత్తంగా వాళ్లకే నష్టం. అందుకే నేను ఎవరినీ ద్వేషించను. మీరు కూడా అలాగే ఉండండి అంటూ... అభిమానులకు పవన్ సూచించారు.

  చచ్చిపోయేంత సహనం అవసరం లేదు

  చచ్చిపోయేంత సహనం అవసరం లేదు

  సహనం ఉండాలి కానీ మనం చచ్చిపోయేంత సహనం అవసరం లేదు. మనం ఎవరి మీద దాడి చేయం కానీ మనలని ఎవరైనా కొడుతుంటూంటే చేతులుకూడా అడ్డు పెట్టకుండా కొట్టమని చెప్తామా? అందుకే మనం చేతులు కట్టుకోని కూచునే పనిలేదు. అదే సమయంలో ఎదురు దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు.... అని పవన్ అన్నారు.

  ఇలాంటోళ్ళని పెంచి పెద్ద చేయటం తప్ప ఇంకేం లేదు

  ఇలాంటోళ్ళని పెంచి పెద్ద చేయటం తప్ప ఇంకేం లేదు

  అవసరం అయితేనే కనీసం మనల్ని గార్డ్ చేసుకుందామంతే. ఎవరైనా మనలని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఎంతో చూడండి మీకే అర్థమైపోతుంది. అనవసరంగా గోలచేసి ఇలాంటోళ్ళని పెంచి పెద్ద చేయటం తప్ప ఇంకేం లేదు.

  English summary
  "My number did not stop ringing. Further, some fanatic fans started targeting all the people who are supporting me online. They are being sent abusive messages and threats. Because, PK fans associations have promised to keep a tab on these things, I am on a hold. If this continues, ownership of the result will be on PK and some of his fanatic fans. Sane fans...Swing in to action or allow the damage to continue. Your wish." Mahesh Kathi posted in FB.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X