»   » ‘అత్తారింటికి దారేది' నదియా రేటు అంతా?

‘అత్తారింటికి దారేది' నదియా రేటు అంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవర్ స్టార్ అత్త పాత్రలో నటించింది నటి నదియా. ఈ చిత్రం సూపర్ హిట్ అవటంతో ఆమెకు తెలుగులో వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె తన రెమ్యునేషన్ ని భారీ ఎత్తున పెంచేసిందని సమాచారం. 'అత్తారింటికి దారేది' కి కేవలం ముప్పై లక్షలు తీసుకున్న ఆమె ఇప్పుడు యాభై లక్షలు లేనిదే కమిట్ కానని తెగేసి చెప్తోందని ఫిల్మ్ నగర్ టాక్.

ప్రభాస్ ...మిర్చి చిత్రంతో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చిన నదియా....పవన్ స్టార్ సినిమాతో పెద్ద స్టార్‌గా మారి పోయింది. దీంతో ఆమోతో ఫోటో షూట్లకు పోటీ పడుతున్నాయి మేగజైన్లు. ఒక టైంలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలను ఊపేసిన నదియా చాలా కాలం తర్వాత మళ్లీ బిజీ అయిపోతుంది. నదియా 'మిర్చి'లో ప్రభాస్ కు తల్లిగా నటించి మంచి మార్కులనే కొట్టేసింది. ఈ సినిమా చూసిన వారు నదియాకు ప్రత్యేకంగా మార్కులు వేశారు.

దీంతో తెలుగులో మరో ఆఫర్ లభించింది. నదియా ఇప్పుడు పవన్ కల్యాణ్ కు అత్తగా నటించే ఛాన్స్ కొట్టేసింది. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో సమంతకు తల్లిగా నటించి అదరకొట్టింది. ఇందులో కూడా ఆధునిక భావాలున్న మహిళగానే నదియా కనిపించనుంది. ఈ సినిమా తనకు మరింత గుర్తింపు తీసుకురావడం తో ఆమె చాలా ఆనందంగా ఉంది. నదియా 1988 లో 'బజార్ రౌడీ' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది. ఆమె పెళ్లి తర్వాత తెలుగు తెరకు దూరమై మళ్లీ మిర్చి చిత్రంలో దర్శనం ఇచ్చింది.

ఇక ఆ మధ్య తమిళ చిత్రం 'తమిరభరణి" డబ్బింగ్ గా తెలుగులో విశాల్ హీరోగా వచ్చిన 'భరణి" చిత్రంలో హీరోయిన్ కి తల్లి పాత్ర పోషించి సినిమాకి హైలెట్ గా నిలిచింది. కాగా కొన్ని సవంత్సరాల తర్వాత తమిళ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో ఓ సినిమాకి లీడ్ రోల్ చేయడానికి ఛాన్స్ వచ్చింది నదియాకి. మిస్కిన్ మంచి దర్శకుడు కాబట్టి ఈ ఆఫర్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట నదియా. కానీ ముందు పాత్ర గురించి వినమని..ఈ పాత్ర కోసం మీరు గుండు కొట్టించుకోవాలని నదియాతో మిస్కిన్ అనగానే ఆమె అదిరిపడిందట. గుండు చేయించుకోను..కావాలంటే విగ్ పెట్టుకుంటానని నదియా చెప్పడంతో గుండు కొట్టించుకోవడానికి రెడీ అయితే చాన్స్ ఇస్తా లేకపోతే లేదని ఖరాకండిగా మిస్కిన్ చెప్పాడని వినికిడి.

English summary
Yesteryear actress Nadiya who appeared as Prabhas’ mother in Mirchi and Pawan Kalyan’s aunt in Attarintiki Daredi managed to pull of both the roles seamlessly.Reports also suggest that Nadiya has hiked her remuneration after the success of Attarintiki Daredi. She is reportedly asking a whopping 50 Lakhs. Incidentally, she was paid just 20 Lakhs for Mirchi and 30 Lakhs for Attarintiki Daredi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu