For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దానికి దిక్కులేదుకానీ... నాగ్ ‘లవ్ స్టోరీ’కి ముహూర్తం!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: కింగ్ నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న రొమాంటిక్ చిత్రం 'లవ్ స్టోరీ'. తాజాగా అందిన సమాచారం ప్రకారం దశరథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి నెలలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తేదీ ఖరారు కావాల్సి ఉంది. ఓ వైపు నాగార్జున నటించిన డమరుకం చిత్రం వాయిదాలు పడుతూ అభిమానులకు విసుగు తెప్పిస్తుంగా...మరో వైపు లవ్ స్టోరీకి డేట్ ఫిక్స్ కావడం గమనార్హం.

  ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'లవ్ స్టోరీ'లో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

  నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో గతంలో 'సంతోషం'చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ మళ్లీ కాంబినేషన్ అనగానే మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. నాగార్జున కెరీర్లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈచిత్రం శాటిలైట్స్ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో రూ. 6 కోట్లు చెల్లించేందుకు ప్రముఖ తెలుగు రీజనల్ ఛానల్ ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సదరు చానల్ ముందుకు వచ్చినట్లు సమాచారం.

  ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

  నాగ్ ఇతర సినిమాల వివరాల్లోకి వెళితే...
  డమరుకం చిత్రం ఈ నెల 23న విడుదల చేసందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు నాగార్జున తొలిసారిగా ఒక మహిళా దర్శకురాలితో కలిసి పని చేయబోతున్నారు. ఇటీవల 'లవ్ లీ' వంటి కమర్షియల్ చిత్రాన్ని తీసి, హిట్ కొట్టిన బి.జయ దర్శకత్వంలో ఆయన ఈ చిత్రం చేయనున్నారు. దీనికి సంబంధించిన స్టోరీ లైన్ కూడా ఓకే అయింది, ప్రస్తుతం స్క్రిప్టు వర్కు జరుగుతోంది. హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగాల్సి ఉంది. త్వరలో ఈ విషయాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

  English summary
  King Nagarjuna, Nayantara starrer romantic entertainer Love Story is gearing up for a release in the month of March 2013. Dasarath is wielding the megaphone for the Love Story.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X