»   » ఆ సినిమాలో పవన్ లాగే ..నాగ్ కూడా అదే బైక్, గెటప్ లో కనిపిస్తారట

ఆ సినిమాలో పవన్ లాగే ..నాగ్ కూడా అదే బైక్, గెటప్ లో కనిపిస్తారట

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: నాగార్జున హీరోగా 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం రిలీజ్ అయ్యింది. వెంటనే నాగ్ మరో ప్రాజెక్టులోకి దూకేసే పోగ్రాం పెట్టుకున్నారు. అందుకోసం ముందే రంగం సిద్దం చేసుకుని హారర్ థ్రిల్లర్ చిత్రం 'రాజు గారి గది 2' కమిటయ్యారు. రాజుగారి గదిలాంటి హర్రర్ బేస్ చిత్రం సీక్వెల్ లో నాగ్ నటించటానికి కారణం ఏమిటి...అసలు ఆయన పాత్ర ఆ సినిమాలో ఏమిటనే విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.


ఫిబ్రవరి 17 నుండి సెట్స్ పైకి రానున్న రాజుగారి గది 2 లో ఓ ప్రత్యేక పాత్రలో నాగ్ కనిపించనున్నారు .అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రంలో నాగ్‌ విల‍క్షణంగా ఉండే గెటప్‌ తో కనిపించనున్నారు. నాగ్ డ్రెస్సింగ్ నుంచి లుక్స్ వరకు అన్నీ ట్రెండీగా ఉంటాయని చెప్తున్నారు.

అలాగే పవన్ ..గోవిందా ..గోవిందా చిత్రంలో కనిపించునట్లుగా ...ఓ ఫ్యాన్సీ బైక్‌ పై హల్‌చల్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తాడని సమాచారం. ఇక నాగ్‌ పాత్ర విషయానికి వస్తే... ఈ సినిమాలో మెంటలిస్ట్‌గా కనిపించబోతున్నారు. అతీంద్రియ శక్తులు కలిగి.. ఎదుటి వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తనతో ఓ ఆట ఆడుకుంటాడని చెప్తుున్నారు.

Nag to play an important role in Raju Gari Gadhi 2

ఇక ఈ చిత్రంలో సమంతా ఓ కీ రోల్‌ లో నటించనుంది. అయితే నాగార్జున, సమంతా జంటగా నటిస్తున్నారనే వార్తల్లో నిజం లేదంటున్నారు చిత్ర యూనిట్‌. వారిద్దరివి వేరు వేరు పాత్రలని, అదేవిధంగా అందరు అనుకుంటున్నట్టు సమంతా దెయ్యం గా కూడా నటించడం లేదని తేలింది. చాలా ఎమోషనల్‌ రోల్‌ లో ఆమె ప్రేక్షకులను అలరించునుందని చెప్తున్నారు.

అంతేకాదు.. ఇంతకు ముందు రాజు గారి గదిలో హీరోగా చేసిన ఓంకార్ తమ్ముడు అశ్విన్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. సీరత్‌ కపూర్‌ ఒక హీరోయిన్‌ చేస్తోంది. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

నాగార్జున మరిన్ని విశేషాలు తెలియజేస్తూ... కామెడీ మేళవించిన హారర్ థ్రిల్లర్ చిత్రమిది. ఇప్పటివరకు ఇలాంటి కథతో సినిమా చేయలేదు. కథ వినగానే ఎక్సైట్ అయ్యాను. నా పాత్ర చిత్రణ వైవిధ్యంగా వుంటుంది అన్నారు. ఓం నమో వెంకటేశాయ షూటింగ్ చివరి రోజు చాలా బాధపడ్డాను. ఓ మంచి సినిమా చిత్రీకరణ అప్పుడే పూర్తయిపోయిందా? అనిపించింది.

ఈ సినిమా తర్వాత ఎలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఓంకార్ వద్ద మంచి కథ వుందని పీవీపీ, నిరంజన్ నాతో చెప్పారు. వయసైపోతుంది కాబట్టి భవిష్యత్తులో నేను లీడ్ క్యారెక్టర్స్ చేస్తానో లేదో తెలియదు. కథలో ఏదో స్పెషాలిటీ వుంటేనే నటిస్తాను అని వారితో అన్నాను. అనుకున్నట్లుగా ఈ సినిమాకు అద్భుతమైన కథ కుదిరింది అన్నారు నాగార్జున.


ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని నాగార్జునను చూస్తారని దర్శకుడు ఓంకార్ పేర్కొన్నారు. నాగార్జునగారి సూచనలతో స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశామని, నిర్మాత పీవీపీ చెప్పారు.

English summary
Raju Gari Gadhi's sequel was launched recently in Hyderabad with Nagarjuna and PVP in attendance. Buzz is that Nagarjuna who attended the launch function of the movie will be playing a significant role,
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu