»   »  వంద కోట్లు పైగా వసూలు చేస్తేనే, నాగ్ చెప్పినట్లు సరైన హిట్

వంద కోట్లు పైగా వసూలు చేస్తేనే, నాగ్ చెప్పినట్లు సరైన హిట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తక్కువ బడ్జెట్ లో తీసిన నాగార్జున చిత్రం సోగ్గాడే చిన్ని నాయినా పెద్ద విజయం సాధించి కోట్లు సంపాదించి పెట్టింది. ఇప్పుడు అదే నాగార్జున తాజా చిత్రం కు అరవై కోట్లు పెట్టుబడి పెట్టారని సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు ఊపిరి.

కార్తి, నాగార్జున కాంబినేషన్, రెండు భాషల్లో రిలీజ్ వంటి అంశాలు దృష్టిలో పెట్టి చేసిన ఈచిత్రం బడ్జెట్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయ్యింది. సోగ్గాడే పేరు చెప్పి మంచి రేట్లకే అమ్ముతున్నారని సమాచారం. అయితే ఎంత చిత్రం బడ్జెట్ రికవరీ అవ్వాలంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలనేది అంచనాలు వేస్తున్నారు.

దాంతో నాగార్జునే ఆ మధ్యన మీడియాతో అన్న విషయం గుర్తు చేసుకోవాలి... ఆయన మాట్లాడుతూ... 'ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం రూ. 50 కోట్ల షేర్ సాధించింది.

Nag's Oopiri - RS 60 CR?

వసూలు చేసిన దాంట్లో సగం కంటే తక్కువ బడ్జెట్(రూ.20 కోట్ల కంటే తక్కువ) తో ఈ సినిమాను తీసాం. ఇలా మంచి లాభాలు వచ్చినపుడే నిజమైన సక్సెస్ అని అర్థం. రూ. 50 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాకు రూ. 50 కోట్ల వసూళ్లు వస్తే ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు' అని వ్యాఖ్యానించారు.

కరెక్టే ఇప్పుడు ఈ సినిమా అరవై కోట్లు పెట్టుబడి పెడితే ఓ వంద కోట్లు అయినా వస్తేనే హిట్ అయినట్లు లెక్క, అలాగే లాభాలు వచ్చినట్లు, ఎవరికైునా ఫలితం ఉన్నట్లు. కాబట్టి నాగార్జున అన్న మాట ఈ సినిమాకు వర్తిస్తుందో లేదో చూడాలి.

చిత్రం విశేషాలకు వస్తే...స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నాలు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వూపిరి' . ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్‌ సంగీతం సమకూర్చారు. మార్చి 25న 'వూపిరి' ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఈ వీడియోలో 'మీరు ఒక్కప్పుడు బాగా రొమాంటిక్‌ అనుకుంటా? అని కార్తీ అన్న మాటకు నాగార్జున బదులుగా... నేను ఎప్పుడూ రొమాంటిక్కే' అని సమాధానం ఇచ్చారు.

English summary
Oopiri featuring Nagarjuna, Karthi and Tamannaah. PVP has reportedly spent a whopping 60 crores on this bilingual.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu