»   »  'రాజుగారి గది 2': కథ వెనక అసలు సీక్రెట్ అదా?దాచిపెట్టి చేస్తున్నారా?నాగ్ కి అయినా తెలుసా?

'రాజుగారి గది 2': కథ వెనక అసలు సీక్రెట్ అదా?దాచిపెట్టి చేస్తున్నారా?నాగ్ కి అయినా తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున హీరోగా ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రాజుగారి గది 2'. పి.వి.పి సినిమా, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలపై ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ఈ చిత్రం గురించి ఓ కొత్త విశేషం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.

అదేమిటంటే... 'రాజుగారి గది 2' చిత్రం ఓ మళయాళి సూపర్ హిట్ చిత్రం కు రీమేక్ అని, ఆ విషయం బయిటకు రివీల్ చేయకుండా సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. మళయాళంలో రంజిత్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన ప్రేతం చిత్రం నుంచి స్టోరీ లైన్ ని ,కొన్ని సీన్స్ ని తీసుకుని ఓంకార్ స్క్రిప్టుని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాత రైట్స్ కూడా తీసుకున్నారట. అయితే ఇందులో నిజమెంత ఉందనే విషయం తెలియాల్సి ఉంది.

నాగార్జున మాట్లాడుతూ ''నా సినీ ప్రయాణం 'మనం'తో ఓ మలుపు తిరిగింది. 'సోగ్గాడే చిన్నినాయనా', 'వూపిరి'... ఇలా విభిన్నమైన సినిమాల్లో నటించి విజయాల్ని సొంతం చేసుకొన్నా. ఈమధ్యే 'ఓం నమో వేంకటేశాయ'లో నటించా. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న దశలోనే నిర్మాతలు ప్రసాద్‌.వి.పొట్లూరి, నిరంజన్‌ కలిసి ఓంకార్‌ దగ్గర ఉన్న థ్రిల్లర్‌ కథని వినమని చెప్పారు. థ్రిల్లర్‌ అనగానే నాకు ఆసక్తి కలిగింది. ఈ కథ విన్నాక అందులో కొత్తదనం నచ్చింది.

Nag's Raju Gari Gadhi 2 is a Remake?

ఇప్పటివరకు నేను ఇలాంటి కథలో నటించలేదు. ఓంకార్‌ తీసిన 'రాజుగారి గది'ని నేను చూడలేదు. కానీ ఓంకార్‌ గురించి నాకు బాగా తెలుసు. గతంలో తనతో ఓ గేమ్‌ షో చేశా.
తనపై నాకు నమ్మకముంది. కచ్చితంగా ఈ చిత్రం మన ప్రేక్షకుల్ని అలరిస్తుంది''అన్నారు.

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది, తెరపై మీరెలా కనిపిస్తారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ... ''మనుషుల ఆలోచనలతో ఆడుకొనే పాత్ర నాది. తెరపై నేనెలా కనిపిస్తాననే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే గెడ్డంతో కనిపించడం ట్రెండ్‌గా మారింది''అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రారంభించిన పెద్ద సినిమా మాదే అని, ఆ ప్రభావం మాపై ఏమాత్రం లేదని నాగార్జున స్పష్టం చేశారు.

ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ ''మా సంస్థతో ఉన్న అనుబంధం దృష్ట్యా నాగార్జునని సంప్రదించగానే కథ విన్నారు. బాగుందని మెచ్చుకొని కొన్ని మార్పులు సూచించారు. ఆ మార్పులు చేసి చక్కటి స్క్రిప్టుని సిద్ధం చేశారు ఓంకార్‌. డిసెంబరు తొలి వారం నుంచి చిత్రీకరణని ప్రారంభిస్తాం. కచ్చితంగా 'రాజుగారి గది 2' అందరి మనసుల్నీ గెలుచుకొంటుంది''అన్నారు. వెన్నెల కిషోర్‌, అశ్విన్‌బాబు, ప్రవీణ్‌, షకలక శంకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దివాకరన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: తమన్‌

English summary
Raju Gari Gadhi 2 is the remake of Malayalam blockbuster Pretham which has been directed by Ranjith Shankar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu