For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట

  |

  సినీ రంగంలో లవ్ ట్రాకులు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు అనేవి సర్వసాధారణంగా కనిపించే అంశాలు. అన్ని ఇండస్ట్రీల్లోనూ తరచూ ఇలాంటి పరిణామాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇలా సుదీర్ఘ కాలం పాటు ప్రేమాయణం సాగించి.. కొన్నేళ్ల క్రితం పెద్దల సమక్ష్యంలో పెళ్లి చేసుకుని.. గత ఏడాది విడాకులు తీసుకున్నారు టాలీవుడ్ కపుల్ సమంత, నాగ చైతన్య. వీళ్లిద్దరూ విడిపోయి చాలా రోజులే అవుతోన్నా.. తరచూ ఈ మాజీ జంట గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతునూ ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత జ్ఞాపకాలతో నాగ చైతన్య ఉన్నాడని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందో మీరే చూడండి మరి!

  అలా ప్రేమ.. ఇలా పెళ్లి చేసుకుని

  అలా ప్రేమ.. ఇలా పెళ్లి చేసుకుని


  సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగ చైతన్య కలిసి 'ఏమాయ చేశావే' సినిమా చేశారు. అప్పుడే ఆమెకు మనోడు ఫ్లాట్ అయిపోయాడు. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. 'ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించి ఆ తర్వాత ఈ సినీ జంట వివాహం చేసుకుంది.

  కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!

  ఫుల్ ఎంజాయ్ చేసిన సినీ జంట

  ఫుల్ ఎంజాయ్ చేసిన సినీ జంట


  మ్యారేజ్ చేసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ వచ్చారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటూ ఎన్నో విజయాలను కూడా ఖాతాల్లో వేసుకున్నారు.

  విడాకులు తీసుకున్న చై - సామ్

  విడాకులు తీసుకున్న చై - సామ్


  టాలీవుడ్‌లోనే బెస్ట్ కపుల్‌గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకున్నారు. తద్వారా నాలుగేళ్ల తమ వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయాన్ని గత అక్టోబర్‌లో అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

  Mrunal Thakur: వ్యభిచార గృహంలో సీతా రామం హీరోయిన్.. రెండు నెలలు నరకం.. ఆ డైరెక్టర్ వల్లేనంటూ!

   విడాకులపై చాలా అనుమానాలు

  విడాకులపై చాలా అనుమానాలు


  సమంత.. నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారని చాలా రోజులుగా వార్తలు వచ్చిన సమయంలోనే వాళ్లు దీన్ని నిజం చేసేశారు. ఇది జరిగి ఏడాది అవుతోన్నా అసలు వీళ్లిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు? దీని వెనుక కారణాలు ఏంటి? వీళ్లిద్దరి మధ్య ఏ విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి? ఇలా రకరకాల అనుమానాలకు మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదనే చెప్పాలి.

  జ్ఞాపకాలపై కూడా పుకార్లు షికార్లు

  జ్ఞాపకాలపై కూడా పుకార్లు షికార్లు


  విడాకులు తీసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య గురించి మరిన్ని ఎక్కువ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నా ఒకరి దగ్గర ఒకరి జ్ఞాపకాలు పదిలంగానే ఉంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, కొందరు మాత్రం ఆ గుర్తులను చెరిపేసి కొత్త జీవితం ప్రారంభించారని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ డైలామాలో పడుతున్నారు.

  ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: సీక్రెట్ పార్ట్ కనిపించేలా ఘోరంగా!

  విడిపోయినా సమంతతోనే చైతూ

  విడిపోయినా సమంతతోనే చైతూ


  సమంత, నాగ చైతన్య బంధం గురించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ సమాచారం ప్రకారం.. కొన్ని విషయాల్లో నాగ చైతన్య.. సమంతను మర్చిపోలేదట. అంతేకాదు, వివాహం జరిగిన తర్వాత ఆమె గుర్తుగా ఉంచుకున్న కొన్నింటిని ఇప్పటికీ ప్రేమగానే చూసుకుంటున్నాడట. అలా విడిపోయినా ఆమెతోనే ఉన్నట్లు చేస్తున్నాడని చెప్తున్నారు.

  పక్కన లేకున్నా ఆ పని చేస్తూనే

  పక్కన లేకున్నా ఆ పని చేస్తూనే


  తాజాగా వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. వివాహం తర్వాత నివాసం ఉన్న ఇంట్లో సమంత కొన్ని మొక్కలను ప్రేమగా పెంచుకునేదట. ఇప్పుడు విడాకులు తీసుకుని వీళ్లు దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మొక్కలను సంరక్షించే బాధ్యతను నాగ చైతన్య తీసుకున్నాడని తెలిసింది. సమంత పక్కన లేకున్నా ఆమె మొక్కలను చైతూ ప్రేమగా చూసుకుంటున్నాడట.

  English summary
  Tollywood Couple Samantha and Naga Chaitanya Recently Separated. Naga Chaitanya Protecting Samantha Plants in Their House
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X