»   » అఫీషియల్ : నాగ చైతన్య వివాహం గురించి

అఫీషియల్ : నాగ చైతన్య వివాహం గురించి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సెలబ్రెటీల వివాహం ఎప్పుడూ మీడియాకు మేతే. తెలుగు హీరోల్లో ప్రభాస్, నాగచైతన్య, రానా వీళ్ల ముగ్గరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్. అందుకే వీరి గురించీ, వీరి వివాహం గురించి ఎప్పుడూ మీడియాలో వార్తలు నలుగుతూంటాయి. వీరి సీక్రెట్ ఎఫైర్స్ ఏమన్నా ఉన్నాయా అని కొందరు మీడియా వ్యక్తులు తవ్వుతూ ఉంటారు. అయితే వారి ట్రిక్స్ ఎప్పుడూ వర్కవుట్ కాలేదు. అయితే తాజాగా నాగచైతన్య స్వయంగా తన వివాహం గురించి మాట్లాడారు.

రీసెంట్ గా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ నాగచైతన్య...‘నా వివాహం గురించి నేను ఎప్పుడూ ఓపెన్ గానే ఉంటాను...నేను ఆల్రెడీ నాకు తగిన అమ్మాయిని చూడమని చెప్పాను. అది పెద్దలు కుదిర్చిన వివాహమైనా, లేక ప్రేమ వివాహమైనా ఏదైనా నాకు ఆనందమే, నేను ఫలానా సమయం అని ఈ ముఖ్యమైన ఈవెంట్ కోసం కేటాయించుకోలేదు. అది రేపైనా జరగవచ్చు లేక చాలా సంవత్సరాలు పట్టవచ్చు, నేను మా నాన్నగారి వద్ద మాత్రం ఏదైనా ఓకే అని చెప్పాను,' అంటూ చెప్పుకొచ్చాడు.

Naga Chaitanya's Wedding Plans Revealed

నాగచైతన్య తాజా చిత్రాలు విషయానికి వస్తే...

ఇప్పుడు 'మజ్ను' పేరుతో నాగార్జున తనయుడు నాగచైతన్య ఓ చిత్రం చేయబోతున్నట్టు సమాచారం. తండ్రి చేసిన 'మజ్ను' విషాదంతో సాగితే... తనయుడు చేసే సినిమా మాత్రం వినోదాత్మకంగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. మలయాళంలో విజయవంతమైన 'ప్రేమమ్‌'ను తెలుగులో నాగచైతన్యపై రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాగచైతన్య హీరోగా నటించబోతున్నారు.

చందు మొండేటి దర్శకత్వం వహిస్తారు. ముగ్గురు హీరోయిన్స్ కి చోటున్న ఈ చిత్రానికి 'మజ్ను' పేరుని ఖరారు చేసి త్వరలో షూటింగ్ ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు 'మజ్ను' అనగానే నాగార్జునే గుర్తుకొస్తారు. విషాదంతో కూడిన ఆ ప్రేమకథా చిత్రంలో నాగార్జున అంతగా ఒదిగిపోయి నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలోని గీతాల్ని ప్రేక్షకులు ఇప్పటికీ పాడుకొంటుంటారు.

English summary
Talking in an interview Naga Chaitanya Said, ‘I am quite open about my marriage and i have already spoke to my family to find a bride. It could be an arranged marriage or a love marriage, I am happy either ways. I cannot fix any time for this important event. It can happen tomorrow or it may take many years. but i confessed to dad that i'm okay either ways,' Chay hinted at his willingness to marry some time soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu