»   »  నాగబాబు రికమండేష్ తోనే పవన్ ...??

నాగబాబు రికమండేష్ తోనే పవన్ ...??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు ఆధ్వర్యంలో చాలా కాలం నుంచి చేస్తున్న రియాలిటీ షో జబర్దస్త్. అందులో నటించే కామెడీ ట్రూప్ బయిట కూడా చాలా ఫేమస్ అయ్యారు. సినిమాల్లోనూ అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు. వాళ్లకు పూర్తిస్దాయి బ్రేక్ ఇవ్వాలని నాగబాబు నిర్ణయించాడని తెలుస్తోంది.

అందులో భాగంగానే తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు నాగబాబు రికమండేషన్ చేసి ఈ టీమ్ చేత సర్దార్ గబ్బర్ సింగ్ లో వేషాలు వేస్తున్నాడని సమాచారం. అందుతున్న సమచారం ప్రకారం జబర్దస్త్ టీమ్ అంతా సర్దార్ గబ్బర్ సింగ్ లో కానిస్టేబుల్స్ గా కనిపించనున్నారు.

దానికి తోడు జబర్దస్త్ బ్యాచ్ మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులు కావటం కూడా ప్లస్ అయ్యిందంటున్నారు. ముఖ్యంగా షకలక శంకర్ అయితే గతంలో పవన్ కు గుడి, ఊళ్లో పవన్ పేరుతో బడి కూడా కట్టిస్తానని చెప్పుకొచ్చారు.

Nagababu recommendations Jabardasth team To Pawan

జబర్దస్త్ తో సర్దార్ గబ్బర్ సింగ్ లో చాలా ఫన్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో జబర్దస్త్ బ్యాచ్ పూర్తిగా బిజీ అయిపోతారని అంటున్నారు. వారు కూడా ఈ సినిమాపై చాలా హోప్ పెట్టుకున్నాడని అంటున్నారు. ముఖ్యంగా నాగబాబుకు ఈ విషయంలో ధాంక్స్ చెప్తున్నాడని చెప్పుకుంటున్నారు.

సర్దార్ విషయానికి వస్తే...ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. బాబి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి పవన్ అంతా తానే వ్యవహిస్తున్నారు. శరద్ మరార్ నిర్మించే ఈ చిత్రం ఏప్రియల్ 8 న విడుదల కానుంది.

English summary
Nagababu is is encouraging Jabardasth TV show artists by recommending them to his brother Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu