»   » షాక్...నాగార్జున కుర్చీకే అన్ని లక్షలు ఖర్చు పెట్టారా?

షాక్...నాగార్జున కుర్చీకే అన్ని లక్షలు ఖర్చు పెట్టారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన 'ఊపిరి' చిత్రం మార్చి 25న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. పివిపి సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 60 కోట్ల ఖర్చు తెరకెక్కించారు. ఇందులో నాగార్జున పూర్తిగా వీల్‌ ఛైర్‌కే పరిమితమయ్యే పాత్రను చేసారు.

నాగార్జున వీల్ చైర్ కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. చక్రాల కుర్చీ ధర 25 లక్షలు అని అంటున్నారు. పివిపి సంస్ధ ప్రత్యేకంగా ఈ కుర్చీని తయారు చేయించిందని, స్వీడన్‌లో స్పెషల్‌ ఆర్డర్‌ ఇచ్చి ఆ ఛైర్‌ని తయారు చేయించినట్టు తెలుస్తోంది. నిజంగానే ఇంత ఖరీదైన వీల్ చైర్లు ఉంటాయా? నమ్మశక్యంగా లేదు కదూ.

 Nagarjuna Oopiri Wheelchair Costs Rs.25 Lakhs

ఈ సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టడానికి కారణం ఇద్దరు స్టార్స్ ఉండటమే. నాగార్జున నటిస్తుండటంతో ఇటు తెలుగులో.... కార్తి నటిస్తుండటంతో అటు తమిళంలో సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తుందని, మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. సినిమాను నాగార్జున కెరీర్ లో భారీ బడ్జెట్ తో అత్యధిక థియేటర్స్ మార్చి 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

నిర్మాత ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ...మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత నాగార్జునగారు ఈ చిత్రంలో టోటల్‌గా డిఫరెంట్‌గా వుండే క్యారెక్టర్‌ చేస్తున్నారు. అలాగే 'ఆవారా' కార్తీ, తమన్నా జంట ఈ చిత్రంతో మరోసారి ఆడియన్స్‌ ని అలరించబోతున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సింగిల్ కట్ కూడా లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా బావుందని ప్రశంసించారు. మార్చి 25న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను వరల్డ్ వైడ్ గా 2 వేల థియేటర్లలో ఆంద్రప్రధేశ్, తెలంగాణ, తమిళనాడు , కర్ణాటక, నార్త్ ఇండియా, యు.ఎస్, గల్ఫ్ కంట్రీస్, మలేషియా, శ్రీలంక, సింగపూర్, యు.కె, ఆప్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.

English summary
Can you estimate the cost of the wheelchair that Akkineni Nagarjuna used in Oopiri movie it’s Rs. 25 Lakhs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu