»   »  నాగార్జున నెగిటివ్ రోల్ ..తమిళ రీమేక్ లో

నాగార్జున నెగిటివ్ రోల్ ..తమిళ రీమేక్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున నెగిటివ్ రోల్ లో కనపడనున్నారా అంటే అవుననే వినపడుతోంది. హీరో పాత్రల కన్నా విభిన్నమైన పాత్రలవైపు మొగ్గు చూపుతున్న నాగార్జున ఇప్పుడు ఊపిరి చిత్రం చేస్తున్నారు. కార్తీ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఇప్పుడు నాగార్జున మరో చిత్రం ఓకే చేసుకునేటట్లు కనపడుతున్నారు.

nag

ఆయన తాజాగా రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం తని ఒరువన్ రీమేక్ లో నెగిటివ్ పాత్ర చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళంలో ఆ పాత్రను అరవింద్ స్వామి చేసారు. ఆయనకు ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఆ పాత్ర కోసం నాగార్జనను అడిగినట్లు సమాచారం. నాగార్జున ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి...ఓకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.


కొద్ది రోజుల క్రిందట విడుదలై సూపర్ టాక్ తో దూసుకుపోతున్న ' 'తని ఒరువన్‌'' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ తో చేయటానికి రంగం సిద్దమయినట్లే అని తెలుస్తోంది. ఈ చిత్రం రైట్స్ ని ఐదున్నర కోట్లకు పొందినట్లు సమాచారం. తమిళంలో డైరక్ట్ చేసిన దర్శకుడు మోహన్ రాజానే ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసేటట్లు ఒప్పందం కుదిరినట్లు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ లోకి సురేంద్రరెడ్డి వచ్చినట్లు వినపడుతోంది.

nag ram

ఈ సినిమాలో పైకి మంచివాడిగా కనిపిస్తూనే విలన్ గా నటించిన అరవింద్ స్వామి పాత్రను...రీమేక్ లోనూ ఆయనే పోషిస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తుంటే... ఇందుకు ఈ వెటరన్ హీరో మాత్రం ఒప్పుకునేలా కనిపించడం లేదట. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తని ఒరువన్ రీమేక్ లో నటించే ఉద్దేశ్యం తనకు లేదని క్లారిటీ ఇచ్చాడట. ఒకే క్యారెక్టర్ ను పదే పదే పోషించడంలో అంత ఆసక్తి ఉండదని వ్యాఖ్యానించిన ఈ 'రోజా' హీరో కామెంట్స్ చాలామంది ఆశలపై నీళ్లు కుమ్మరించిందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

కోలీవుడ్‌లో రాణిస్తున్న తెలుగు సోదరులు జయంరాజా, రవి. దర్శకుడు, నటుడిగా ఇప్పటి వరకు రీమేక్‌ చిత్రాలతో వచ్చిన వీరు.. తొలిసారిగా 'తని ఒరువన్‌'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్‌గానూ ఈ చిత్రం వసూళ్లు రాబడుతోంది. నయనతార, అరవింద్‌స్వామి, నాజర్‌, తంబిరామయ్య తదితరుల నటన కూడా సినిమాకు ప్లస్‌పాయింట్‌గా మారింది. చిత్ర విజయోత్సవ వేడుక చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.

nag1

జయంరాజా మాట్లాడుతూ.. ''నా వద్దకు వచ్చే నటులందరూ రీమేక్‌ చిత్రాలను తెరకెక్కిస్తే చేయడానికి సిద్ధమే అంటున్నారు. ఇన్ని సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ.. నన్ను నేరు చిత్ర దర్శకుడిగా ఎవరూ గుర్తించలేదు. నేను ఆ స్థాయివాణ్ని కాకపోయినప్పటికీ.. సొంతంగా సినిమాకు దర్శకత్వం వహించగలను. ఆ నమ్మకంతోనే 'తని ఒరువన్‌'తో తొలివిత్తు నాటాను. ఇప్పుడు అది మహావృక్షంగా నాకు ఎనలేని సంతోషాన్ని పంచుతోంది''అని ఉద్వేగానికి గురయ్యారు.

దీంతో వేదికపై ఉన్న తమ్ముడు జయంరవికి కూడా కళ్లు చెమ్మగిల్లాయి. అనంతరం జయంరవి మాట్లాడుతూ.. ''గతంలో నా విజయాన్ని చూసి అన్న గర్వపడేవారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రీమేక్‌ చిత్రాలన్నీ నాకే గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు దర్శకుడిగా ఆయన గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవడం నాకు గర్వంగా ఉంది. మా అన్న చాలా సీరియస్‌ దర్శకుడన్న విషయం ఈ చిత్రం ద్వారా తేటతెల్లమైంద''ని చెప్పారు.

English summary
‘Thani Oruvan’ remake makers have contacted Nagarjuna for Aravind Swamy role and Nag who watched the film readily gave green signal.
Please Wait while comments are loading...