»   » హారర్-కామెడీ: ‘రాజుగారి గది-2’లో అక్కినేని నాగార్జున?

హారర్-కామెడీ: ‘రాజుగారి గది-2’లో అక్కినేని నాగార్జున?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆట డ్యాన్స్ షోతో పాటు పాపులర్ టీవీ యాంకర్ గా పేరు తెచ్చుకుని సినిమా రంగంలో దర్శకుడిగా రాజుగారి గది వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను రూపొందించిన ఓంకార్, ప్రముక నిర్మాణ సంస్థ బ్యానర్ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కాంబినేషన్ లో రాజుగారి గది2 రూపొందుతోంది.

2015లో విడుదలైన రాజుగారి గది చిత్రం పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాకుండా హర్రర్ కామెడి జోనర్ లో ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఓంకార్ రాజుగారి గది చిత్రాన్ని వారాహి చలనచిత్రంతో సహకారంతో నిర్మించిన సంగతి తెలిసిందే.

Nagarjuna In Raju Gari Gadi 2!

కాగా రాజుగారి గది2 చిత్రానికి పివిపి సినిమా బ్యానర్ తోడు కావడంతో కాస్టింగ్ విషయంలో కానీ, టెక్నికల్ పరంగా కానీ సినిమా స్కేల్ పెరిగింది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారు.

కీలకమైన పాత్రలో నాగార్జున

ఇందులో ఓ కీలకమైన పాత్రలో నాగార్జున కనిపిస్తారని సమాచారం. ఇది వరకు ఈ పాత్ర వెంకటేష్‌ చేస్తారని చెప్పు కొన్నారు. అది చివరికి నాగార్జున చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. హారర్‌ చిత్రంలో నటించడం నాగ్‌కి ఇదే ప్రధమం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.

English summary
Nagarjuna’s unfamiliar thirst for unconventional script selection is yet again proved. He signed director Ohmkar to play a crucial central lead in Raju Gari Gadi 2.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu