53 ఏళ్ల హీరోయిన్ తో నాగార్జున రొమాన్స్.. 27 ఏళ్ల తర్వాత హిట్ ఫెయిర్ రిపీట్!
Nagarjuna's 100th film: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెరపై అడుగుపెట్టిన నాగ్, తనదైన నటనతో, క్లాస్ అండ్ మాస్ ఇమేజ్‌తో టాలీవుడ్‌లో సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు కింగ్ నాగర్జున. ఆరుపదుల వయస్సులో కూడా ఫిట్‌నెస్, స్టైల్ తో యంగ్ హీరోలతో పోటీపడుతున్నారు. తన కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా సినిమాల్లో ఉన్నప్పటికీ... నాగార్జున మాత్రం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ హీరోగా సత్తా చాటుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఎవర్‌గ్రీన్ స్టార్ తన కెరీర్‌లో మైలురాయి ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. అదే 100వ సినిమా. అయితే.. ఈ సినిమాలో 53 ఏళ్ల హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
అక్కినేని నాగార్జున తన 100 సినిమాకు 'కింగ్ 100'అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నాడు. నాగ్ 100వ సినిమా కావడంతో అక్కినేని కుటుంబం మొత్తం ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సమాచారం. ముఖ్యంగా నాగ్ కొడుకులు నాగచైతన్య, అఖిల్ గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నారని టాక్. ఇక ఈ సినిమా టైటిల్‌గా ప్రస్తుతం 'లాటరీ కింగ్' లేదా 'కింగ్ 100'పేర్లు పరిశీలనలో ఉన్నాయట. సినిమా ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పూర్తి చేసుకొని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన 53 ఏళ్ల నటి టబు నటించబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి టాలీవుడ్ హిట్ జంటల్లో ఒకటి అక్కినేని నాగార్జున - టబు. ఈ ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్‌స్క్రీన్ ఫ్రెండ్‌షిప్ రెండూ ఎప్పటికప్పుడు చర్చనీయాంశాలే. 27 ఏళ్ల క్రితం నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే సినిమాల్లో ఈ జంట మెరిసింది. ఆ తర్వాత మళ్లీ ఓసారి సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. అక్కినేని నాగార్జున కెరీర్‌లో మైలురాయి మూవీగా తెరకెక్కుతున్న 100వ సినిమాలో టబు స్పెషల్ రోల్‌లో నటించబోతుందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
టబు ఎంట్రీతో హైప్ రెట్టింపు!
నాగ్ 100వ సినిమాకి టబు ఎంట్రీ ఇస్తే.. అది స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఈ ఇద్దరి కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ వేరు. సిసింద్రీలో నాగ్-టబు జంటగా కనిపించిన స్పెషల్ సాంగ్ ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయింది. ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ జంట జతకడుతున్నారంటే.. అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నాగ్-టబు కాంబినేషన్ రీ యూనియన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ గా మారాయి.
టబు ప్రస్తుతం పూరీ జగన్నాథ్ - విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మరో చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఒకవేళ నాగ్ సినిమా కన్‌ఫర్మ్ అయితే, ఇది టబు ఈ సీజన్‌లో రెండో టాలీవుడ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే.. సమాచారం ప్రకారం.. నాగార్జున భారీ బడ్జెట్ మూవీని 2026 మే నెలలో సమ్మర్ రిలీజ్‌గా ప్లాన్ చేస్తున్నారట. నాగార్జున చివరిసారిగా రజినీకాంత్ 'కూలీ'లో విలన్‌గా మెప్పించాడు. ఆ సినిమాలో ఆయన పాత్ర చనిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. అందుకే ఈసారి నాగ్ మళ్లీ మాస్, క్లాస్ మిశ్రమ రోల్‌లో కనిపించబోతున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











