»   » అఖిల్, శ్రీయా మ్యారెజ్ క్యాన్సిల్?.. కారణం అదేనా..

అఖిల్, శ్రీయా మ్యారెజ్ క్యాన్సిల్?.. కారణం అదేనా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగార్జున, అమల దంపతుల కుమారుడు అఖిల్ పెండ్లి వాయిదా పడినట్టు ఓ రూమర్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ వార్తపై అటు అక్కినేని కుటుంబం, ఇటు జీవీకే ఫ్యామిలీ కూడా పెదవి విప్పకపోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నది. మే నెలలో ఇటలీలో డిస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

గత రెండురోజులుగా మీడియాలో వైరల్

గత రెండురోజులుగా మీడియాలో వైరల్

టాలీవుడ్‌తోపాటు బిజినెస్ వర్గాల్లో అఖిల్, శ్రీయా భూపాల్ వివాహం ఆగిపోయిందనే విషయం గత రెండురోజులుగా చర్చజరుగుతంది. బుధవారం ఆంగ్ల దినపత్రిక కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఇరు కుటుంబాల బంధువులు ఈ వార్త అవుననే అంటున్నాయి.

ఇద్దరి అభిప్రాయ బేధాలే కారణమా?

ఇద్దరి అభిప్రాయ బేధాలే కారణమా?

అఖిల్, శ్రియాల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తాయని, వివాహం క్యాన్సిల్ కావడానికి ఇదే ప్రధాన కారణమని కొందరు చెబుతున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అఖిల్, శ్రియాలతో మాట్లాడారని... అయినా ఫలితం లేకపోవడంతో, మ్యారేజ్ క్యాన్సిల్ చేశారని సమాచారం.

డిసెంబర్‌లో హైదరాబాద్ ఎంగేజ్‌మెంట్

డిసెంబర్‌లో హైదరాబాద్ ఎంగేజ్‌మెంట్

అక్కినేని అఖిల్, శ్రీయా భూపాల్ల ఎంగేజ్‌మెంట్ గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని జీవీకే హౌస్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. మే నెలలో ఇటలీలో వివాహం జరుపాలని ఇరుకుటుంబాలు నిర్ణయించాయి. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. తాజా పరిస్థితుల కారణంగా వివాహాన్ని క్యాన్సిల్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

ఇటలీలోని రోమ్‌లో డెస్టినేషన్ మ్యారేజ్

ఇటలీలోని రోమ్‌లో డెస్టినేషన్ మ్యారేజ్

ఇటలీ రాజధాని రోమ్‌లో జరుగనున్న అఖిల్, శ్రీయా భూపాల్ వివాహానికి దాదాపు 700 మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో బడా పారిశ్రామికవేత్తలు, దక్షిణాది సినీ పరిశ్రమ పెద్దలు, కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. అతిథులకు హోటల్ రూమ్స్, రిసార్ట్స్ చాలా వరకు బుక్ చేసేశారు.

ఫ్లయిట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకోండి.. అతిథులకు రిక్వెస్ట్

ఫ్లయిట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకోండి.. అతిథులకు రిక్వెస్ట్

తాజా పరిణామాల నేపథ్యంలో ఇటలీకి టికెట్లు బుక్ చేసుకున్నఅతిథులను రద్దు చేసుకోమని చెప్పినట్లు సమాచారం. అతిథులందరినీ విమాన టికెట్లు క్యాన్సిల్ చేసుకోమని గత శనివారం చెప్పినా.. సరైన కారణం మాత్రం చెప్పలేదు. ఇంకా టికెట్లు బుక్ చేసుకోని వాళ్లు ఇక ఆ ప్రయత్నం మానేయాలని చెప్పినట్లు సమాచారం.

చివరి నిమిషం వరకు ప్రయత్నాలు.. ఆ తర్వాతే

చివరి నిమిషం వరకు ప్రయత్నాలు.. ఆ తర్వాతే

అఖిల్ పెండ్లి రద్దు కావడానికి ఖచ్చితమైన కారణం చెప్పకపోయినా.. చివరి నిమిషంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలకు సన్మిహితుడైన ఒక వ్యక్తి ఆంగ్ల దిన పత్రికతో మాట్లాడుతూ.. గత వారం వరకు అంతా సజావుగానే సాగింది.. కాని చివరకు ఏమైందో తెలియడం లేదు. నాకైతే ఈ విషయం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యాను అని వ్యాఖ్యానించాడు.

గత రెండేండ్లుగా అఖిల్, శ్రీయా మధ్య ఆఫైర్

గత రెండేండ్లుగా అఖిల్, శ్రీయా మధ్య ఆఫైర్

గత రెండేండ్లుగా అఫైర్‌లో ఉన్న అఖిల్, శ్రీయాలు పెద్దలను ఒప్పించి డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కాని ఇంతలోనే ఈ సమాచారం బయటకు రావడం టాలీవుడ్, బిజినెస్ సర్కిల్స్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది.

English summary
Akkineni Nagarjuna’s son Akhil’s engagement with fashion designer Shriya Bhupal has reportedly been called off. This Young Hero of Akkineni family wedding Planed in may in Italy. The two have been dating for a few years now and got engaged in a private ceremony in 2016 at the GVK House. According to reports, the engagement was called off by Akhil and Shriya while Nagarjuna and GVK Reddy reluctantly gave in.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu