»   » ఇన్‌సైడ్ టాక్..: 'ఛలో' డైరెక్టర్ అసంతృప్తి; నాగశౌర్య 'డబుల్ గేమ్' వద్దన్నాడట..

ఇన్‌సైడ్ టాక్..: 'ఛలో' డైరెక్టర్ అసంతృప్తి; నాగశౌర్య 'డబుల్ గేమ్' వద్దన్నాడట..

Posted By: Mittapalli Srinivas
Subscribe to Filmibeat Telugu

రాత్రనకా.. పగలనకా... ఓ కథ కోసం బుర్రలు బద్దలు కొట్టుకుని.. దానికో రూపాన్ని తీసుకొచ్చి.. నిర్మాతల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి.. చిట్టచివరకు ఓ ఛాన్స్ దక్కించుకుని.. 'డైరెక్టర్' కల నిజమైపోయిందనుకుంటున్న తరుణంలో.. ఇక నీ అవసరం తీరిందంటూ పక్కనపెట్టేస్తే ఎలా ఉంటుంది. పాపం 'ఛలో' సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల పరిస్థితి కూడా ఇప్పుడిలాగే తయారైందట..

డిసప్పాయింట్ అయ్యా.. ‘ఛలో’ వేదికపై చిరంజీవి..!

నేను పిలిస్తే ఆయన రాలేదు, డిసప్పాయింట్ అయ్యా : 'ఛలో' వేదికపై చిరంజీవి

 అసలేమైంది?:

అసలేమైంది?:

నాగశౌర్య గత సినిమాలకు లేనంత పబ్లిసిటీ 'ఛలో' సినిమాకు లభించింది. ప్రీ-రిలీజ్ వేడుకకు చిరంజీవి రావడం వల్లనో.. లేక ఆడియో జనాలకు బాగా కనెక్ట్ అవడం వల్లనో మొత్తానికి 'ఛలో'పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.


అయితే ఈ పబ్లిసిటీ అంతా హీరో చుట్టే తిరుగుతుండటం.. తన పేరు పెద్దగా వినిపించకపోతుండటంతో డైరెక్టర్ వెంకీ కుడుముల కాస్త నొచ్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.


డైరెక్టర్‌ను సైడ్ చేశారని:

డైరెక్టర్‌ను సైడ్ చేశారని:

'ఛలో' పబ్లిసిటీ కోసం చేస్తున్న కార్యక్రమాల్లో దర్శకుడు వెంకీ పేరును సైడ్ చేసేశారని, ఆడియో ఫంక్షన్ లోనూ ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది. సినిమా కోసం అంత కష్టపడితే ఇప్పుడిలా తనను పట్టించుకోకపోవడంపై దర్శకుడు కాస్త అసంతృప్తితో ఉన్నాడట.


 ఇన్‌సైడ్ టాక్..:

ఇన్‌సైడ్ టాక్..:

ఓవైపు దర్శకుడిని చిత్ర యూనిట్ పట్టించుకోవట్లేదన్న ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు ఇతర బ్యానర్ల నుంచి అప్పుడే వెంకీ కుడుములకు ఆహ్వానాలు అందుతున్నాయన్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ గీత ఆర్ట్స్ నుంచి వెంకీకి కబురు వచ్చిందని.. మంచి కథతో వస్తే అవకాశం ఇస్తామని చెప్పినట్లు టాక్.


డబుల్ గేమ్ ఎందుకు సార్..: నాగశౌర్య

డబుల్ గేమ్ ఎందుకు సార్..: నాగశౌర్య

ఇక ఈ సినిమాకు తానే ఎందుకు నిర్మాతగా మారాల్సి వచ్చిందో హీరో నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. 'ఇదే కథతో దర్శకుడు వెంకీ ఓ నిర్మాత వద్దకు వెళ్తే.. నాగశౌర్య ఎందుకు వేరే హీరోతో చేద్దాం అన్నాడు. అదే కథ పట్టుకుని మళ్లీ నేను వెళ్లి అడిగితే.. దర్శకుడిని మార్చేద్దాం అన్నాడు.' అని నాగశౌర్య చెప్పుకొచ్చాడు.


 తల్లి సూచనతో..:

తల్లి సూచనతో..:

కథ విన్న నిర్మాత తమతో డబుల్ గేమ్ ఆడుతున్నాడని అర్థమై.. 'ఎందుకు సార్.. మాతో డబుల్ గేమ్ ఆడుతారు..' అని మొహం మీదే అడిగేసినట్లు నాగశౌర్య తెలిపారు. తన తల్లి ఉషా ముల్పూరి సూచన మేరకే హోం ప్రొడక్షన్ లోనే సినిమాను తెరకెక్కించి విడుదల చేస్తున్నామని తెలిపాడు. ఈ సినిమా ఒక ఎమోషనల్ జర్నీ అని పేర్కొన్నాడు.


ఫిబ్రవరి 2న రిలీజ్:

ఫిబ్రవరి 2న రిలీజ్:

ఫిబ్రవరి 2న ఛలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. సినిమా బాగా వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి సినిమాయే అయినా.. దర్శకుడు సినిమా బాగా తీయగలిగాడని అంటున్నారు. ఈ సినిమా తర్వాత నాగశౌర్యకు, దర్శకుడు వెంకీ కుడుములకు మంచి ఫ్యూచర్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంగీతం మహతి స్వరసాగర్. సినిమాటోగ్రఫీ సాయిశ్రీరామ్.


English summary
CHALO movie director Venky Kudumula was little unhappy on producers for not giving importance to him in promotional events. Film Nagar people are discussing on this speculations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu