»   » హరికృష్ణని వద్దని ఎన్టీఆర్ అంటే నాగీనీడు సీన్ లోకి

హరికృష్ణని వద్దని ఎన్టీఆర్ అంటే నాగీనీడు సీన్ లోకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ త్వరలో పవన్ కళ్యాణ్ కి తండ్రిగా కనిపించనున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోన్న సంగతి తెలిసిందే. అయితే సీన్ మారింది. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి నాగినీడు వచ్చి చేరాడు. మర్యాద రామన్న సినిమాతో విలన్ గా పరిచయమైన నాగినీడు ఈ చిత్రంలో పవన్ కి తండ్రిగా కనపించనున్నాడు. హరికృష్ణ వెళ్ళి పవన్ క్యాంప్ లో వేషాలు వేస్తే రకరకాల అపోహలకు చోటు ఇచ్చినట్లవుతుందని ఎన్టీఆర్ కలగచేసుకుని హరికృష్ణ చేత నో చెప్పించినట్లు తెలుస్తోంది. అందులోనూ గతంలో దర్శకుడు హరీష్ శంకర్, ఎన్టీఆర్ ల సినిమా కూడా ప్రారంభం కాకుండానే చిన్న చిన్న వివాదాలతో ఆగిపోయింది. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ అలా చేసి ఉండవచ్చని అంటున్నారు.

ఇక సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ "దబాంగ్"ఆధారంగా "గబ్బర్ సింగ్" రూపొందుతోంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై పవన్ కళ్యాణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, "షాక్", "మిరపకాయ్" చిత్రాల ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. మొదట్లో ఈ పాత్రకు కృష్ణరాజుని అనుకున్నారు. అయితే చివరి క్షణాల్లో నిర్ణయం మార్చుకున్నారని తెలస్తోంది. ఇక తల్లిగా సహజనటి జయసుధ చేసే అవకాసం ఉంది. ఇక నాగినీడు తనకు ఆ పాత్రలో నటించటానికి ఉత్సాహం చూపిస్తున్నారని తెలిసింది.

English summary
Nagineedu being considered to act as Pawan Kalyan’s father in Gabbar Singh, which is Dabangg remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu