Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
విభేదాలను పక్కన పెట్టేసిన మహేశ్ బాబు.. డైనమిక్ డైరెక్టర్‌తో నమ్రత రహస్య చర్చలు.!
సూపర్ స్టార్ మహేశ్ బాబు... తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో ఒకడు. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్.. ప్రయోగాలు చేయడానికి కూడా వెనుకాడడు. వాటి వల్ల కొన్ని పరాజయాలు పలకరించినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ దర్శకుడితో ఉన్న విభేదాలకు పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నాడట. అందుకోసం మహేశ్ భార్య నమ్రత రంగంలోకి దిగారని సమాచారం. ఇటీవలే సదరు డైరెక్టర్‌తో ఆమె రహస్యంగా చర్చలు జరిపారని టాక్. ఆ వివరాలు మీకోసం.!

సరిలేరు అనిపించుకున్న మహేశ్ బాబు
ఈ సంక్రాంతికి మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఈ విజయంతో మహేశ్ ఖాతాలో హ్యాట్రిక్ నమోదైంది. దీని కంటే ముందు అతడు ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి హిట్లను అందుకున్నాడు.

అతడితో అనుకుంటే.. ఇంకొకరు ఫిక్సయ్యారు
‘సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ సమయంలోనే ఆగిపోయింది. ఈ పరిణామం జరిగిన వెంటనే సూపర్ స్టార్.. మరో డైరెక్టర్ పరశురాంతో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కానుంది.

చిరు సినిమాలో మహేశ్.. డీల్ కుదరలేదు
చేయాలనుకున్న సినిమా ఆగిపోయిందనుకున్న సమయంలో మహేశ్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య'లో అవకాశం వచ్చింది. కీలక పాత్ర కోసం ఆయనను సంప్రదించగా.. ముప్పై రోజులు డేట్స్ కేటాయించేందుకు రూ. 30 కోట్లు డిమాండ్ చేశాడట. అయితే, చిత్ర యూనిట్ మాత్రం రూ. 15 కోట్లు ఇస్తామని చెప్పడంతో మహేశ్ నో చెప్పాడని ప్రచారం జరుగుతోంది.

ఆలస్యాన్ని అలా మేనేజ్ చేయాలని ప్లాన్
‘సరిలేరు నీకెవ్వరు' విడుదలై దాదాపు రెండు నెలలు పూర్తయినప్పటికీ.. మహేశ్ మరో సినిమాను ప్రకటించలేదు. కొద్ది రోజుల్లో కొత్త సినిమా ప్రారంభం అవుతుందనగా.. కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది. దీంతో మహేశ్ కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఒకేసారి కొన్ని ప్రాజెక్టులను ఫైనల్ చేసి, గ్యాప్ లేకుండా వాటి షూటింగ్ పూర్తి చేయాలని అతడు ప్లాన్ చేసినట్లు సమాచారం.

విభేదాలను పక్కన పెట్టేసిన మహేశ్ బాబు
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడట. వాస్తవానికి వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఆయనతో మూడో సినిమా చేయాలని సూపర్ స్టార్ నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

డైనమిక్ డైరెక్టర్‌తో నమ్రత రహస్య చర్చలు.!
‘పోకిరి', ‘బిజినెస్‌మ్యాన్' వంటి సూపర్ హిట్లను అందించిన పూరీ జగన్నాథ్‌తో మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ రహస్యంగా మంతనాలు జరిపారని ఓ న్యూస్ లీక్ అయింది. దీంతో గతంలో అనుకున్న పూరీ డ్రీమ్ ప్రాజెక్టు ‘జనగణమన' మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, ఇటీవలే దీనిని పవన్ కల్యాణ్‌తో చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
Recommended Video

మహేశ్‌పై షాకింగ్ కామెంట్స్.. ఒప్పుకుంటాడా.?
‘ఇస్మార్ట్ శంకర్' విడుదల సమయంలో పూరీ.. మహేశ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఎప్పటికైనా నా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన' చేయాలని ఉంది. ఈ ప్రాజెక్ట్ మహేష్‌తో అనుకున్న మాట వాస్తవమే. నేను హిట్స్‌లో ఉంటేనే ఆయన చేస్తారు. ఒకవేళ హిట్ పడిన తర్వాత మహేష్ సినిమా చేస్తానన్నా.. ఓకే చెప్పడానికి నాకూ ఓ క్యారెక్టర్ అనేది ఉంటుంది కదా' అని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో మరోసారి మహేశ్‌తో మూవీ చేయడానికి పూరీ సిద్ధపడతాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.