»   » నమ్రతకు అసలు సంబంధమే లేదా, కేవలం రూమరేనా?

నమ్రతకు అసలు సంబంధమే లేదా, కేవలం రూమరేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తున్న ‘బ్రహ్మోత్సవం' ఓవర్సీస్ రైట్స్ ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాలన్నింటినీ బీట్ చేసి రూ. 13 కోట్లకు అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్త వెనక ఓ రూమర్ కూడా స్ప్రెడ్ అయింది.

ఈ డీల్ వెనక మహేష్ బాబు భార్య నమ్రత మాస్టర్ మైండ్ ఉందని, తెర వెనక ఈ డీల్ వ్యవహారం అంతా ఆమె నడిపించారని ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలను పివిపి సంస్థ ప్రతినిధులు కొట్టి పారేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు గానీ, నమ్రత గానీ ఈ సినిమాకు నిర్మాతలు కాదు.... వారు ఈ వ్యవహారంలో వేలు పెట్టడానికి అవకాశమే లేదని తేలి పోయింది. సౌతిండియాలో అతిపెద్ద సినీ నిర్మాణ సంస్థ అయిన పివిపి సంస్థ కు.... మహేష్ బాబు భార్య మీద ఆధారపడాల్సిన అవసరం లేదనేది మరికొందరి వాదన.

ఆసంగతి పక్న పెడితే.....‘బ్రహ్మోత్సవం' సినిమాకు ఓవర్సీస్ లో ఇంత డిమాండ్ ఏర్పడటానికి కారణం శ్రీమంతుడు సినిమా ఓవరాల్ గా యుఎస్ లో 18 కోట్లకి పైనే కలెక్ట్ చేయటమే. మరో ప్రక్క ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ ఇటీవల విడుదల చేసిన టీజర్ కూడా ప్లస్ అయ్యింది.

Namratha not behind Brahmotsavam overseas deal

పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ ‘బ్రహ్మోత్సవం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయవాడ బ్యాక్ డ్రాప్ తో సినిమా సాగుతుంది. మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ఈ చిత్రం ఏప్రియల్ 8, 2016న విడుదల చేయటానికి గతంలో తేదీని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఏప్రియల్ 29 కి వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్ ఎగ్రిమెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

English summary
Namratha not behind Brahmotsavam overseas deal, there's no truth in it. Ever since the news of Mahesh Babu's Brahmotsavam fetching a whopping Rs 13 Crore in overseas broke out, rumour mongers are busy crediting Namratha as the mastermind behind the deal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu