Just In
- 7 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
- 7 hrs ago
రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
- 7 hrs ago
చిరంజీవి వారసత్వం ఎవ్వరికీ దక్కదు... ఆ స్థాయి ఆ ఒక్కడికే.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
- 8 hrs ago
శర్వానంద్ నా బిడ్డలాంటి వాడు.. రాంచరణ్ ఫోన్ చేసి.. శ్రీకారం ఫంక్షన్లో చిరంజీవి ఎమోషనల్
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- News
మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం
- Finance
భారీగా పడిపోయిన బంగారం ధరలు, 10 గ్రాములు రూ.44,200 మాత్రమే!
- Sports
India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్.. కొంతకాలం రెండో కీపర్గా కొనసాగించాలి'
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కన్ఫర్మ్.. బాలకృష్ణ పవర్‌ఫుల్ ప్లాన్.. ఇదే జరిగితే!!
తెలుగు చిత్రసీమలో సినీ వారసుల హంగామా నడుస్తోంది. వారసులుగా సినీ గడప తొక్కిన అందరూ సక్సెస్ బాటలో పయనిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలోని బడా హీరోల వారసులంతా రంగంలోకి దిగి ట్రాక్ ఎక్కేశారు. కానీ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం సందేహంగా మారడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే ఇప్పుడు అందరినీ ఖుషీ చేసేలా బాలకృష్ణ పవర్‌ఫుల్ ప్లాన్ చేశారట. ఆ వివరాలేంటో చూద్దామా..

మోక్షజ్ఞ సినీ ఆరంగేట్రం.. అతనొక్కడే మిగిలింది
ఇప్పటికే నందమూరి వంశం ఎంతో మంది హీరోలు సినీ ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ వంశం నుంచి వెండితెరపై కాలు మోపేందుకు ఒక్క బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మాత్రమే మిగిలిపోయాడు. ఇతను సినిమాల్లోకి రాబోతున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నప్పటికీ.. ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ రాలేదు.

బాలకృష్ణ భారీ ప్లాన్..
నిజానికి ఈ పాటికే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం కావాల్సి ఉంది. కానీ ఆయన మాత్రం నటనపై ఆసక్తి చూపకపోవడం కారణంగానే ఇన్ని రోజులు ఆలస్యమవుతోందని టాక్. ఓ వైపు తన కొడుకు కోసం బాలకృష్ణ భారీ లాంఛ్ ప్లాన్ చేస్తున్నా కూడా మోక్షజ్ఞ కాస్త ఆలోచిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అంతా ఫిక్సయ్యారు.. ఈ తరుణంలో
మరోవైపు నందమూరి మోక్షజ్ఞకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని, ఆయన తన చదువులపైనే దృష్టి సారిస్తున్నాడని ఇటీవల వార్తల జోరు పెరగడంతో ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కష్టమే అని ఫిక్సయ్యారంతా. ఈ పరిస్థితుల్లో మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

మోక్షజ్ఞను ఒప్పించిన బాలయ్య.. అక్కడి నుంచి రాగానే
మోక్షజ్ఞకు నటనపై ఆసక్తి చేకూరేలా అమెరికా పంపించి.. న్యూయార్క్‌లో ఉన్న లీ స్టార్స్ బర్గ్ ఫిలిం ఇన్ స్టిట్యూట్‌లో ఒక షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ ఇప్పించాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు అమెరికా వెళ్ళే విధంగా మోక్షజ్ఞను బాలయ్య ఒప్పించినట్లు ఫిలిం నగర్ టాక్. అమెరికా నుంచి రాగానే తన సినిమా సెట్స్ పైకి కూడా తీసుకొస్తూ అతనిలో ఆసక్తి పెంచేలా ప్రయత్నాలు చేస్తారట బాలయ్య.

బాలకృష్ణ- బోయపాటి మూవీ
ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఆయన సరసన శ్రీయ, నయనతారలను ఫైనల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.