»   » నాని కథ ఓకే చేసాడు...డైరక్టర్ హ్యాపీ

నాని కథ ఓకే చేసాడు...డైరక్టర్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మొగాడివోయ్ చిత్రాలతో నాని క్రితం సంవత్సరం ఫామ్ లోకి వచ్చాడు. అలాగే ఈ సంవత్సవం ప్రారంభంలో కృష్ణగాడి వీర ప్రేమ గాధ అంటూ పలకరించాడు. రెవిన్యూ పరంగా ఓ మోస్తరుగా ఉన్నా సినిమా అందరి మన్ననలూ పొందింది. దాంతో ఇదే ఉషారులో మరో చిత్రం కమిటయ్యాడు.

అందుతున్న సమచారం ప్రకారం నాని రీసెంట్ గా భలే మంచి రోజు చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయిన శ్రీరామ్ ఆదిత్య స్క్రిప్టు విన్నారు. శ్రీరామ్ ఆదిత్య చెప్పిన స్టోరీ లైన్ విన్న నాని, పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా భలే మంచి రోజు చిత్రం బాగుందని సైతం మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దాంతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Nani to work with director of Bhale Manchi Roju

అంటే త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయన్నమాట. అన్నీ సెట్ అయితే ...గోపీచంద్ తో వరస సినిమాలు నిర్మించే భవ్య క్రియేషన్స్ వారు నాని-శ్రీరామ్ ఆదిత్యల సినిమాను నిర్మిస్తారు.

ప్రస్తుతం నాని ..తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అంతేకాదు...ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మతోనూ, సినిమా చూపిస్తా మామ దర్శకుడు నక్కిన త్రినాధరావుల కధలు కూడా ఓకే చేసి, త్వరలో వాటిని పట్టాలు ఎక్కించటానికి రెడీ అవుతున్నాడు.

English summary
Nani has flagged off another film to be directed by Sriram Aditya of ‘Bhale Manchi Roju’ fame. Nani and Sriram have been having several meetings to lock the project and the director finally got a heads-up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu