»   » 'నాన్నకు ప్రేమతో' సీన్స్..రామ్ చరణ్ కు ట్విస్ట్

'నాన్నకు ప్రేమతో' సీన్స్..రామ్ చరణ్ కు ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం నాన్నకు ప్రేమతో. ఈ చిత్రం రిజల్ట్ ఏంటనేది ప్రక్కన పెడితే సుకుమార్ మార్క్ మేకింగ్ కు, ఎన్టీఆర్ స్టైలిష్ యాక్టింగ్ మంచి మార్కులే పడ్డాయి. అయితే అనుకోని ట్విస్ట్ రామ్ చరణ్ కే వచ్చి పడింది.

ఈ చిత్రంలో కొన్ని సీన్స్ ..రామ్ చరణ్ త్వరలో చేయబోతున్న తని ఒరువన్ రీమేక్ లో సీన్స్ ని కాపీ చేసారని వినపడుతోంది. ముఖ్యంగా .. కథలో భాగంగా ఎన్టీఆర్...ఏం ప్లాన్ చేస్తునన్నాడనే విషయాలు తెలుసుకోవటం కోసం అతని ఆఫీస్ లో మైక్రో చిప్ ప్లాంట్ చేస్తారు. అతని ప్లాన్స్ విని దానికి అణుగుణంగా నడుచుకోవటం, దానికి ఎన్టీఆర్ క్లైమాక్స్ రిటార్డ్ ఇస్తాడు. ఇవన్నీ తని ఒరువన్ చిత్రంలో కీలకమైన పాయింట్స్.

Nannaku Prematho twist to Ram Charan

వాటిని తీసేస్తే తని ఒరువన్ అర్దం లేని కథగా మిగులుతుంది. అలాగని పెట్టుకుంటే రామ్ చరణ్ కాపీ కొట్టినట్లు అవుతుంది. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ కు ఓ రేంజిలో ట్విస్ట్ పడినట్లు అయ్యింది.

ఈ నేపధ్యంలో ఈ సమస్యను ఎలా రామ్ చరణ్ అధిగమిస్తాడనే విషయం ఆసక్తికరంగా మారింది. సురేంద్ర రెడ్డి సైతం తల పట్టుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకూ అధికారికంగా కామెంట్ చేయకబోయినా ఏం చేయాలో అర్దం కాని స్దితిలో రామ్ చరణ్, సురేంద్ర రెడ్డి పడ్డారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటునున్నారు. అయినా సుకుమార్ ఇలా ఎత్తేయటమేంటి అని విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

English summary
Naanaku Prematho's uncanny resemblance to Tamil blockbuster film, Thani Oruvan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu