»   » వెరైటీగా ఉందే :నారా రోహిత్ 'సావిత్రి' కథ ఇదేనా?

వెరైటీగా ఉందే :నారా రోహిత్ 'సావిత్రి' కథ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రెండు వారాల క్రితమే 'తుంటరి'గా తెరమీదకొచ్చిన నారా రోహిత్ అప్పుడే మరో చిత్రాన్ని సిద్దం చేసేసి ఈ వారంలో మన ముందుకు వస్తున్నాడు చేస్తున్నాడు. ఈ సారి తనకు జోడీగా నందితను తీసుకుని 'సావిత్రి' అనే టైటిల్ తో దిగుతున్నాడు.

'ప్రేమ ఇష్క్ కాదల్' ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 1 విడుదల అవుతోంది. ఈ సినిమాని విజన్ ఫిల్మ్ మేకర్స్ పతాకంపై వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం కథ అంటూ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలోకి వచ్చింది.


తుంటరికన్నా బాగుంటుందని చెప్తున్నారు. పూర్తి స్దాయి ఫన్ తో రొమాంటిక్ కామెడీగా చిత్రం రూపొందిందని వినపడుతోంది. పబ్లిసిటీ బాగా చేయగలగితే సినిమా యూత్ కు, ప్యామిలీలకు పడుతుందని చెప్పుకుంటున్నారు. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ కు థియోటర్ దద్దరిల్లుతుందని అంటున్నారు. మరి ఆ కథ ఏమిటా అని తెలుసుకోవాలని ఉందా..అయితే క్రింద చదవండి..


Also Read: నారా రోహిత్ గురించి ఓ నమ్మలేని నిజం : కృష్ణ, చిరంజీవి, ఇప్పుడు ఈ హీరోనే


అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కథ ఇలా ఉండబోతోంది. సావిత్రి (నందిత) కు చిన్నప్పటి నుంచి పెళ్లంటే మహా ఇష్టం. తన అక్కకు పెళ్లి అవుతోందంటే చాలా ఆనందపడుతుంది...కానీ ఆమె పెళ్లి సమయంలో వేరే ప్రేమ కథ ఉందని తెలుస్తుంది.


అతనితో లేచిపోవటానికి సావిత్రి సాయిపడుతుంది. ఆమె ఇంటెన్షన్ ఏమిటంటే...తన అక్క వెళ్లిపోతే.... పెళ్లి ఆపకుండా పెద్దలు ఆ పెళ్లి కొడుకుని తనకు ఇచ్చి చేస్తారని. అయితే అప్పుడు మరో ట్విస్ట్...


మిగతా కథ..స్లైడ్ షోలో చదవండి..


ఎవరూ రారు..

ఎవరూ రారు..

అప్పుడు సావిత్రి కు ఆమె ఆంటి...ఇలా మీ అక్క లేచిపోవటం వల్ల నీ పెళ్లి కాదు..మీ కుటుంబంతో ఎవరూ సంభందం కలుపుకోవటానికి ఎవరూ రారు అని తేల్చి చెప్తుందికష్టపడి వెనక్కి

కష్టపడి వెనక్కి

అప్పుడు కష్టపడి సావిత్రి తన పరిచయాలతో ... కష్టపడి తన అక్కని పట్టుకుని వెనక్కి తీసుకుని వస్తుంది. అక్క గోలెత్తి పోతుంది..అయినా సావిత్రి మాత్రం వెనక్కి తీసుకువచ్చి పెళ్లి పీటలపై కూర్చోబెడుతుంది. అప్పుడు కుటుంబ సభ్యులు సావిత్రి అక్కకి ఆ పెళ్లి చేస్తారు.


హీరో ఎంట్రీ

హీరో ఎంట్రీ

ఈ సందర్భంలో ఆనందంలో..దేముడుకు ధాంక్స్ చెప్పుకోవాటనికి సావిత్రి కుటుంబ సభ్యులంతా షిర్డీ బయిలుదేరతారు. ట్రైయిన్ ప్రయాణంలో రిషి (నారా రోహిత్) పరిచయమవుతాడు.


లవ్ ఎట్ ఫస్ట్ సైట్

లవ్ ఎట్ ఫస్ట్ సైట్

అతను తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కానీ సావిత్రి ఏక్సెప్టు చేయదు.ఎట్ లాస్ట్

ఎట్ లాస్ట్

ట్రైన్ లో ఎపిసోడ్ లో ఈ లవ్ ఎపిసోడ్ సాగి..అది ఫినిష్ అయ్యేసరికి సావిత్రి ఆ ప్రేమను ఓకే చేస్తుంది.జాతకంలో సమస్య

జాతకంలో సమస్య

ఈలోగా నారా రోహిత్ తల్లి తండ్రులు..అతని జాతకం చూపిస్తే...అందులో ఓ సమస్య ఉందని, అదేంటంటే...అలాంటి జాతకం ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని లేకపోతే జీవితం ప్రమాదంలో పడుతుందని అని రాసి ఉంటుంది.


అయ్యే..ఇంకో ట్విస్ట్..

అయ్యే..ఇంకో ట్విస్ట్..

దాంతో నారా రోహిత్ పేరెంట్స్ అతని వివాహాన్ని...ఓ అమ్మాయితో ఎరేంజ్ చేస్తారు. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేలోగా ఇది జరిగిపోతుంది. రోహిత్ చాలా టెన్షన్ పడతాడు.లక్కీనే ..

లక్కీనే ..

అయితే అదృష్టవశాత్తు చివరి నిముషాల్లో ఆ మరో అమ్మాయి మరెవరో కాదు సావిత్రి అని తెలుస్తుంది. సావిత్రినే తన ఇంట్లో వాళ్లు ఓకే చేసి సెట్ చేసారని అర్దం అవుతుంది.ఈ లోగా

ఈ లోగా

అయితే ఈ లోగా సావిత్రి తండ్రితోనే తను మాట్లాడుతున్నాను అని తెలియక...ఆయనతో ఫోన్ లో మీ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ కాన్సిల్..నేను వేరే అమ్మాయిని ప్రేమించా...వేరే సంభంధం చూసుకోండి అని చెప్పేస్తాడు.


విలన్ ఎంట్రీ...

విలన్ ఎంట్రీ...

ఈలోగా రవిబాబు అనే నలభై సంవత్సరాల బ్యాచిలర్...సావిత్రి వివాహాన్ని చివరి నిముషాల్లో ఎలాగైనా ఆపుచేయించి, పెళ్లి చేసుకోవాలని తిరుగుతూంటాడు.రవిబాబు ప్లాష్ బ్యాక్

రవిబాబు ప్లాష్ బ్యాక్

ఎందుకంటే అతనికి ఆ కుటుంబంపై ముప్పై సంవత్సార పగ. అతనికో కామెడీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదేంటంటే సావిత్రి మరో సోదరి గతంలో రవిబాబు తో లేచిపోబోతుంటే కుటుంబ సభ్యులు పట్టుకుని , రవిబాబుని తన్నివేరే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు.


రివేంజ్

రివేంజ్

దాంతో తన పెళ్లిని,ప్రేమని చెడగొడ్డిన సావిత్రి కుటుంబంపై రివేంజ్ తీర్చుకోవటానికి, సావిత్రిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు రవిబాబు.ఎలా..

ఎలా..

ఇలా రకరకాల ట్విస్ట్ లను ఛేధించి నారా రోహిత్ తన లవర్ సావిత్రిని ఎలా పెళ్లి చేసుకున్నాడనేది మిగతా కథ.సూపర్ హిట్

సూపర్ హిట్

శ్రవణ్ సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే సూపర్ హిట్ ట్రాక్ లోకి చేరింది. పాటలు కూడా విజువల్ గా తెరపై బాగా వచ్చాయని తెలుస్తోంది.డైలాగులు ..

డైలాగులు ..

ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి గేయ రచయిత కృష్ణ చైతన్య సంభాషణలు సమకూర్చడం విశేషం.
గమనిక: కేవలం ఈ కథ..సినిమా సర్కిల్స్ లో ప్రచారంలో ఉన్నది మాత్రమే...ఇందులో ఎంతవరకూ నిజముంది అనేది రిలీజ్ అయితే కానీ తెలియదు..కాబట్టి సరదాగా చదవండి..సీరియస్ గా ఇదే కథ అని ఫిక్స్ అవకండి..

English summary
Nara Rohit is coming to entertain as Savitri on April 1st.Film stars Nandita as heroine under the direction of Pawan Sadineni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu