Don't Miss!
- News
ఇంకో రెండేళ్లే- సీఎంకు అన్నీ తెలుసు- ప్రశాంత్ కిశోర్ సంచలన స్టేట్మెంట్
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు మీకు విజయాన్ని అందిస్తాయి
- Sports
U19 Women’s T20 World Cup: ఫైనల్ చేరిన భారత్.. సెమీస్‌లో న్యూజిలాండ్ చిత్తు!
- Technology
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
బాలయ్యతో కయ్యానికి కాలు దువ్వుతున్న యువ హీరో.. పొలిటికల్ విలన్‌గా..
వరుస పరాజయాలు ఎదురవుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా ముందడుగు వేస్తున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచీ అదే దూకుడును ప్రదర్శిస్తున్న ఈ హీరో... జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోను ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, సినిమాలతో పాటే రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఫలితంగా రెండు సార్లు ఎమ్మెల్యేగానూ ఎంపికయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్యతో కయ్యానికి కాలు దువ్వేందుకు ఓ యంగ్ హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసింది. ఆ వివరాలు మీకోసం.!

బాలయ్యకు కలిసి రాని సంవత్సరం ఇదే
దాదాపు నలభై సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఎత్తు పల్లాలను చూశాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా 2019లో ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ముందు ఘోర పరాజయాన్ని అందుకున్నాయి. గత ఏడాది ఆయన ఏకంగా మూడు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన విషయం తెలిసిందే.

హిట్ కోసం కలిసొచ్చిన దర్శకుడితో జోడీ
వరుస
పరాజయాలను
ఎదుర్కొంటోన్న
నందమూరి
బాలకృష్ణ...
ఆ
సారి
ఎలాగైనా
హిట్
కొట్టాలనే
పట్టుదలతో
ఉన్నాడు.
ఇందుకోసం
తనకు
గతంలో
‘సింహా',
‘లెజెండ్'
వంటి
సూపర్
హిట్లను
అందించిన
మాస్
డైరెక్టర్
బోయపాటి
శ్రీనుతో
కలిశాడు.
వీళ్లిద్దరి
కాంబినేషన్‌లో
రాబోతున్న
ఈ
ప్రతిష్టాత్మక
సినిమాను
మిర్యాల
రవీందర్
రెడ్డి
భారీ
బడ్జెట్‌తో
నిర్మిస్తున్నాడు.

సరికొత్తగా బాలయ్య.. అందుకే ఆ గెటప్
హిట్ కాంబో కావడంతో ఈ సారి మరింత పవర్‌ఫుల్ స్టోరీతో వస్తున్నారు బోయపాటి శ్రీను - బాలకృష్ణ. ఇందులో భాగంగానే ఈ సినిమాలో హీరోను సరికొత్తగా చూపించాలని డైరెక్టర్ భావిస్తున్నాడు. ఇందుకోసం బాలకృష్ణతో అఘోరా పాత్రను చేయిస్తున్నాడాయన. అంతేకాదు, ఇందులో ఆయన మరో పాత్రను కూడా చేస్తున్నాడు. అదే పవర్‌ఫుల్ ఫార్మర్ రోల్ అని తెలుస్తోంది.

ఎన్నో ఊహాగానాలు.. ఏదీ క్లారిటీ లేదు
క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో సీనియర్ హీరోయిన్ రోజా నటిస్తుందని, సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నాడని, మరికొందరు హీరోలు కీలక పాత్రలు పోషిస్తున్నారని, జబర్ధస్త్ యాంకర్లు ప్రత్యేక గీతాలు చేస్తున్నారని... ఇలా ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, వీటిలో దేనికీ చిత్ర యూనిట్ స్పందించలేదు.

ఒక్క వీడియో... అంచనాలు పెంచింది
హిట్ కాంబినేషన్ అయినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు అంతగా ఏర్పడలేదు. అసలు ఈ సినిమా గురించి పెద్దగా చర్చలు కూడా జరగలేదు. కానీ, బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్‌తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న అనుమానాలకు చెక్ పెట్టేలా... దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అంతేకాదు, అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

రాజకీయాల్లో మరో యంగ్ హీరో ఎంట్రీ
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, వేణు తొట్టెంపూడి, శ్రీకాంత్, రాజశేఖర్ సహా ఎంతో మంది హీరోలు నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో మరో యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది. అది కూడా బాలయ్యతో కయ్యానికి కాలు దువ్వే యంగ్ పొలిటీషియన్ రోల్ అని సమాచారం.
Recommended Video

సినిమాలో వాళ్లిద్దరి సీక్వెన్స్ హైలైట్
బాలయ్య ఉంటున్న నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తాడట నవీన్ చంద్ర. ఆ తర్వాత అభివృద్ధి పనుల విషయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరుగుతుందట. అక్కడి నుంచి ఈ ఇద్దరూ శత్రువులుగా మారడం... ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వంటి సీన్లు సినిమాకు హైలైట్ అవుతాయని సమాచారం. ఇక, ఈ సీక్వెన్స్‌లో బాలయ్య డైలాగ్స్ అదిరిపోతాయని టాక్.