twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : ‘నాయక్’ సక్సెస్ టూర్ కాస్ట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సంక్రాంతి కానుకగా ఇటీవల విడుదలైన 'నాయక్' చిత్రం ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు విజయయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20న ప్రత్యేక చార్టర్డ్ విమానంలో వారు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో థియేటర్ల వద్ద ప్రేక్షకుల్ని కలుసుకున్నారు. అయితే ఆ చార్డర్డ్ ప్లైట్ కి అయిన ఖర్చు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అక్షరాలా పాతిక లక్షల రూపాయలు ఆ ఒక్క రోజు టూర్ కి ఖర్చైందని తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ డేట్స్ అంతకన్నా విలువైనవి కాబట్టి ఇదేం పెద్ద ఖర్చేం కాదని అంటున్నారు.

    ఈసందర్భంగా జరిగిన సభలో హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ ఈ చిత్ర కథ అభిమానుల కోసం ప్రత్యేకించి తయారు చేయబడిందన్నారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకాభిమానులకు కృత జ్ఞతలు తెలిపారు. రామ్ చరణ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్స్ గా చేసారు. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. ఎస్.ఎస్ తమన్ అందించిన ఈ చిత్రం ఆడియో అభిమానులను అలరిస్తోంది. అలాగే ...సినిమాలో ...నా జోలికి వస్తే క్షమిస్తాను కానీ...నా వాళ్ల జోలికి వస్తే నరికేస్తాను... ,ముఖ్యంగా... ఏరియా బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు...కరేజ్, ప్రభత్వం కోసం ప్రజలు ఉండరు..ప్రజలు కోసమే ప్రభుత్వం ఉండాలి, వంటి డైలాగ్స్ చరణ్ అభిమానులను ఓ రేంజిలో అలరిస్తున్నాయి.

    మాస్ హీరోయిజాన్ని చాలా పవర్‌ఫుల్‌గా, హార్ట్ టచింగ్‌గా ప్రెజెంట్ చేయడంలో వినాయక్‌ది అందె వేసిన చేయి. చిరంజీవిని 'ఠాగూర్'గాను, అల్లు అర్జున్‌ని 'బన్నీ'గాను, 'బద్రినాథ్'గానూ ఆవిష్కరించిన వినాయక్ ప్రస్తుతం రామ్‌చరణ్‌ని 'నాయక్'గా తీరిదిద్ది మెగాభిమానులను మరోసారి అలరించారు. 'మగధీర' తర్వాత రామ్‌చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించిన సినిమా ఇది. రామ్‌చరణ్, వినాయక్ చిత్రానికి తమన్ స్వరాలందించడం ఇదే ప్రథమం. చిరంజీవి ఒకప్పటి హిట్ సినిమా 'కొండవీటి దొంగ'లోని ప్రాచుర్య గీతం 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో..'ను ఇందులో రీమిక్స్ చేసి రామ్‌చరణ్, అమలాపాల్‌పై చిత్రీకరించారు. ఈ పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ఛార్మి ఓ పాటలో ఐటమ్‌గాళ్‌గా చేసింది. 'ఒయ్యారమంటే ఏలూరే..' పాటను రామ్‌చరణ్, ఛార్మిపై చిత్రీకరించారు.

    ఆకుల శివ మంచి స్క్రిప్ట్ ఇచ్చారని, వినాయక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, రామ్‌చరణ్ తన మెగా పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారని నిర్మాత చెప్పారు. యూనివర్శల్ మీడియా పతాకంపై ఎస్. రాధాకృష్ణ సమర్పలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్‌.

    English summary
    
 The multi-city tour of Nayak has become a grand success. Reportedly, the chopper came with a price tag of Rs 25 lakhs to cover the four main cities in the state excluding Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X