»   » చిరు 150 : హీరోయిన్ డేట్స్ ఇచ్చేసింది, కథ కాపీ విషయమే తేలాలి

చిరు 150 : హీరోయిన్ డేట్స్ ఇచ్చేసింది, కథ కాపీ విషయమే తేలాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :చిరంజీవి 150వ చిత్రం కోసం పూర్తి స్దాయిలో రంగం సిద్ధం అవుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన 'కత్తి'ని తెలుగులో చిరు కోసం రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ బాధ్యతను దర్శకుడు వి.వి.వినాయక్‌ చేపట్టారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి.

మరోవైపు గత కొద్ది రోజులుగా హీరోయిన్ కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటికే నయనతార, అనుష్కలను సంప్రదించారని తెలుస్తోంది. అయితే తాను బాహుబలి బిజీలో ఉన్నానని, డేట్స్ కష్టమని అనుష్క తేల్చేసిందని, దాంతో నయనతార ఖరారు సమాచారం. ఈ మేరకు నయనతార మే నెల నుంచి డేట్స్ కేటాయించింది. ఏప్రియల్ ముహూర్తం చేసి, రెగ్యులర్ షూటింగ్ జరుపుతారు.

Also Read: 150వ సినిమా కోసం చిరంజీవి న్యూ లుక్! (ఫోటోస్)

Nayanatara allots dates to Chiru's 150th

ఇప్పటి వరకూ స్టార్ హీరోలలందరితోనూ జోడీ కట్టిన నయన్‌ చిరుతో మాత్రం నటించలేదు. సో.. అది కొత్త కాంబినేషనే. అన్నట్టు ఈ చిత్రంలో మరో యంగ్ హీరయిన్ కీ చోటుందని తెలుస్తోంది. ఆ స్థానం ఎవరికి దక్కుతుందో చూడాలి. వచ్చేనెలలో 'కత్తి' సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు.

మరో ప్రక్క ఈ చిత్రం మార్చి 27న చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ పుట్టినరోజున ఈ చిత్ర షూటింగ్‌ ఆరంభం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే నరసింహరావు అనే కో డైరక్టర్ వేసిన కధా చౌర్యం కేసు సెటిల్ అయితే కానీ ప్రారంభించలేరు.

Nayanatara allots dates to Chiru's 150th

వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాకి చరణ్‌ తొలిసారి నిర్మాతగా వ్యవహరించం క్రేజ్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా ఖరారు కాగా, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ గా అడిగినట్లు తెలుస్తోంది. చిరంజీవి, వి.వి. వినాయక్‌ కాంబినేషన్‌లో చివరి సారిగా 'ఠాగూర్‌' చిత్రం విడుదలైంది.

English summary
Nayantara is said to have allotted her dates to Chiru's 150th film from May.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu