»   » ‘ఓ మైగాడ్’ రీమేక్ లో నయనతార

‘ఓ మైగాడ్’ రీమేక్ లో నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక చిత్రం కోసం ఓ నిర్మాతకు డేట్స్ ఇచ్చి ఆ సినిమా ప్రారంభం కాకపోతే...ఆ డేట్స్ వృధా కాకుండా వేరే నిర్మాతకు వాటిని ఎడ్జెస్ట్ చేసి, ఆ డబ్బుని రికవరీ చేయటం సినీ పరిశ్రమలో మామూలే. ఇటీవల నయనతార విషయంలో అదే జరిగిందని సమాచారం. వెంకటేశ్-మారుతి కాంబినేషన్‌లో మొదలు కావాల్సిన 'రాధ' చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ రకరకాల కారణాలతో 'రాధ' సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో నయనతార డేట్స్‌ని నిర్మాత డీవీవీ దానయ్య వేరే నిర్మాతకి ఎడ్జెస్ట్ చేసారు.

వెంకటేశ్ హీరోగా రూపొందనున్న 'ఓ మై గాడ్' రీమేక్‌కి ఆ డేట్స్‌ని ఇచ్చేశారని తెలుస్తోంది. అయితే వాస్తవానికి ఓ మైగాడ్ లో హీరోయిన్ కి అంత ప్రాధాన్యత ఉండేటంత సీన్ లేదు. కానీ దర్శకుడు దాని నిడివి పెంచి తెలుగుకి అణుగుణంగా తయారు చేసాడంటున్నారు. కిషోర్‌కుమార్(డాలీ) దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ప్రత్యేక పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ సూపర్ హిట్ 'ఓ మై గాడ్' సినిమాకి రీమేక్ ఓ చిత్రాన్ని పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. అయితే పవన్ స్వయంగా పార్టీ పెట్టి ప్రచారంకి వెళ్తూన్న నేఫధ్యంలో ఈ చిత్రం ఉంటుందా..ఉండదా..వేరే హీరో వచ్చి పవన్ ప్లేస్ ని రీ ప్లేస్ చేస్తాడా అనే ఊహాగానాలు అంతటా వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రీమేక్ పై పవన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. మే నెల రెండో వారం నుంచీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాసం ఉంది. అప్పటికి ఎలక్షన్స్ ముగియనుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Nayanathara

ఈ మేరకు మెగా స్పీడుతో స్క్రిప్టు రెడీ అవుతోంది. అయితే అందుతున్న సమాచం ప్రకారకం బాలీవుడ్ చిత్రాన్ని చాలా మార్చి తెలుగు నేటివిటికి తగినట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఒరిజనల్ లో ఉన్న పరేష్ రావెల్ పాత్ర కు ఇద్దరు పిల్లలు ఉంటే..ఇక్కడ వెంకటేష్ కి ఇద్దరు చెల్లెళ్లు ఉండేలా మార్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ సైతం పూర్తి మార్పుతో ఉంటుందని,దానిపై కసరత్తు జరుగుతోందని చెప్తున్నారు.


గతంలో నాగార్జున ...మోడ్రన్ దేముడుగా కృష్ణా అర్జున చిత్రంలో కనిపించి ఆకట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఆ సమస్య పవన్ కి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అంతేకాకుండా పవన్ పాత్రను చాలా పెంచుతున్నారని అంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రానికి ఏం పేరు పెట్టే అవకాసముందే విషయమై మీడియాలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి 'ఓరి దేముడా'అనే టైటిల్ పెట్టే అవకాసముందని చెప్తున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయటానికి నిర్ణయించారని ఫిల్మ్ సర్కిల్సో లో వినిపిస్తోంది.

పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు.

కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు. పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.

'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

English summary
‘Radha’ movie has now been halted and Venkatesh has moved on to the ‘Oh My God’ remake. Since producer DVV Danayya has Nayanathara’s dates, he reportedly gave them to the makers of ‘Oh My God’ remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu