»   » చిరంజీవి 150లో బికినీ సీన్లు చేయనంటోంది!

చిరంజీవి 150లో బికినీ సీన్లు చేయనంటోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో ఖరారైన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ చిత్రంగా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. మరోవైపు గత కొద్ది రోజులుగా హీరోయిన్ కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

ఇప్పటికే నయనతార, అనుష్కలను సంప్రదించారని తెలుస్తోంది. అయితే తాను బాహుబలి బిజీలో ఉన్నానని, డేట్స్ కష్టమని అనుష్క తేల్చేసిందని, దాంతో నయనతార ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు నయనతార మే నెల నుంచి డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఏప్రియల్ లో సినిమాను ప్రారంభించిన, రెగ్యులర్ షూటింగ్ జరుపుతారు.

Nayantara rejected scene in Chiranjeevi's 150th film

నయనతార ఓకే కానీ...ఆమె పెట్టే కండీషన్లే దర్శక నిర్మాతలకు విసుగు తెప్పిస్తున్నాయి. తమిళ వెర్షన్ కత్తి సినిమాలో హీరోయిన్ చాలా గ్లామరస్ గా కనిపించింది. తెలుగులో కూడా అదే రేంజిలో హీరోయిన్ ను చూపించాలని వివి వినాయక్ ఫిక్స్ అయ్యాడు. బికినీ సీన్ కూడా ఉంటే బావుటుందని వినాయక్ ఆలోయన. ఇదే విషయాన్ని నయనతారకు చెప్పాడట. అయితే నయనతార మాత్రం....బికినీ సీన్లు చేయనని తేల్చి చెప్పినట్లు సమాచారం.

అసలు నయనతారతో ముందు నుండీ తలనొప్పే. రెమ్యూనరేషన్ విషయంలో కొండెక్కి కూర్చుంది. 3 కోట్లకుపైగా డిమాండ్ చేసింది. ఇపుడు బికినీ వేయనంటోంది. ఇలా అయితే ఈవిడతో కష్టమే అని అంటున్నారు. నయనతారతో ఇంకా అగ్రిమెంటు కాలేదు కాబట్టి వినాయక్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? అనేది చర్చనీయాంశం అయింది.

English summary
VV Vinayak is busy making arrangements for chiranjeevi's 150th film, a remake of Tamil hit "Kaththi". Buzz has that heroine Nayantara rejected the idea of slipping into bikini and made it clear that she will act in the film sans that bikini scene.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu