»   » ఒంటరిగా నయనతార హోటల్‌లో.. సహజీవనానికి బ్రేక్!

ఒంటరిగా నయనతార హోటల్‌లో.. సహజీవనానికి బ్రేక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీతార నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల మధ్య ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిందా అంటే అవును అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రెండేళ్ల వారి లవ్ లైఫ్‌కు బ్రేక్ పడినట్టు వారి సన్నిహితులు పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆ బ్రేక్ అప్ నుంచి బయటపడటానికి ప్రస్తుతం నయనతార వరుసగా ఏడు సినిమాలను ఒప్పుకొన్నట్టు తెలుస్తున్నది. విశాల్‌తో కలిసి ఆమె తాజాగా ఓ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.

రెండేళ్లుగా విఘ్నేష్‌తో నయన సహజీవనం

రెండేళ్లుగా విఘ్నేష్‌తో నయన సహజీవనం

నయనతార, విఘ్నేష్ శివన్‌ల ప్రేమాయణం గత రెండేళ్లుగా తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్. వారి మధ్య సంబంధాలు చాలా సన్నిహితంగా ఉండేవి. వారిద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో కలిసి సహజీవనం చేశారనేది బహిరంగ సత్యం. అయితే వారిద్దరూ విడిపోయి ప్రస్తుతం వేర్వేరుగా జీవిస్తున్నట్టు సమాచారం.

విడిపోయి స్టార్ హోటల్‌లో మకాం

విడిపోయి స్టార్ హోటల్‌లో మకాం

గత రెండు సంవత్సరాలుగా విఘ్నేశ్‌తో కలిసి ఒకే ఇంటిలో ఉన్న నయనతార ప్రస్తుతం ప్రముఖ స్టార్ హోటల్‌లో ఉంటున్నట్టు సమాచారం. లాంచెస్ అనే స్టార్ హోటల్‌లో ప్రస్తుతం అద్దెకు ఉంటున్నట్టు ఓ తమిళ కథనాన్ని వెల్లడించింది.

ప్రభుదేవా తర్వాత మరో బ్రేక్ అప్

ప్రభుదేవా తర్వాత మరో బ్రేక్ అప్

గతంలో ప్రభుదేవాతో ప్రేమాయణం పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోయింది. అప్పట్లో తాము పెళ్లి చేసుకొంటున్నట్టు నయనతార మీడియాకు వెల్లడించింది. సినిమాలను అంగీకరించడం నిలిపివేసింది. శ్రీరామదాసు చిత్రం షూటింగ్‌లో నటనకు గుడ్‌బై చెప్తున్నట్టు కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే.

బ్రేక్ అప్ తర్వాత వరుస సినిమాలు

బ్రేక్ అప్ తర్వాత వరుస సినిమాలు

ప్రభుదేవాతో బ్రేక్ అప్ తర్వాత ఆ ప్రేమ వ్యవహారాన్ని మరిచిపోవడానికి వరుసగా సినిమాలను అంగీకరించి బిజీగా మారింది. ఆ తర్వాత శివన్‌తో ప్రేమలో పడినట్టు ప్రచారం జరిగింది. ఆ రూమర్‌కు బలం చేకూరేలా వారు వ్యవహరించడంతో దానికి బలం చేకూరింది. ప్రస్తుతం విఘ్నేష్‌తో బ్రేక్ అప్ తర్వాత నయనతార మళ్లీ వరుసగా సినిమాలు చేయడం గమనార్హం.

English summary
The past few days some sections of the media reported that Nayanthara and Vignesh Sivan have split. Over the past 2 years, they have been in living relationship. After breakup Nayanatra living in Launches star hotel, which now relies on a rented room.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu