»   » ప్రభుదేవాను రహస్యంగా కలిసిన నయనతార?

ప్రభుదేవాను రహస్యంగా కలిసిన నయనతార?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nayanthara meets Prabhu Deva in a secret place
హైదరాబాద్: ప్రభుదేవా, నయనతార మధ్య ఎంత ఘాటు ప్రేమాయణం సాగిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కొంత కాలం పాటు కలిసి సహజీవనం చేసిన ఇద్దరూ ఒకానొక సందర్భంలో పెళ్లి చేసుకునే వరకు వెళ్లారు. అయితే అనుకోకుండా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడటంతో విడిపోయారు. అనంతరం తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు.

విడిపోయిన తర్వాత ప్రభుదేవా బాలీవుడ్లో పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా మారిపోతే.....నయనతార మళ్లీ హీరోయిన్‌గా బిజీ అయిపోయింది. అయితే తాజాగా వీరి గురించి ఇపుడు సినిమా సర్కిల్‍‌లో ఓ హాట్ న్యూస్ వినిపిస్తోంది. ఇటీవల ఇద్దరూ రహస్యంగా కలుసుకున్నట్లు చర్చించుకుంటున్నారు.

విడిపోయిన ఇద్దరూ రహస్యంగా కలుసుకోవడం వెనక కారణం ఏమిటి? అనేది చర్చనీయాంశం అయింది. నయనతార బాలీవుడ్ ఎంట్రీకి ఆసక్తి చూపుతోందని, అందులో భాగంగానే వీరి మీటింగ్ జరిగినట్లు సమాచారం. ఏది ఏమైనా మాజీ ప్రేమికులు మళ్లీ కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక వీరి సినిమా ప్రాజెక్టుల విషయానికొస్తే...నయనతార ఇటీవల నటించిన ఆరంభం అనే తమిళ చిత్రం భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో నటించిన 'అనామిక' చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. మరో మూడు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ప్రభుదేవా ఇటీవల 'ఆర్..రాజ్ కుమార్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్టుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

English summary

 Film Nagar source said that, Nayanthara meets Prabhu Deva in a secret place.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu