»   » నయనతార మళ్లీ మతం మారిందట, అతని కోసమేనా?

నయనతార మళ్లీ మతం మారిందట, అతని కోసమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి, ఆమె ప్రేమ వ్యవహారాల గురించి అందరికీ తెలిసిందే. తొలి నాళ్లలో శింబుతో ఆమె ప్రేమాయణం ఓ సంచలనం. అతనితో విడిపోయిన తర్వాత ప్రభుదేవాతో నయనతార ప్రేమ వ్యవహారం దాదాపు పెళ్లి వరకు వెళ్లింది. ప్రభుదేవా కోసం అప్పట్లో నయనతార క్రైస్తవం నుండి హిందూ మతంలోకి మారింది. సినిమాలను కూడా వదిలేద్దామని నిర్ణయించుకుంది. చివరి నిమిషంలో ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు.

తర్వాత నయనతార మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం, వరుసగా హిట్లు అందుకోవడంతో పాటు బిజీ హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. తమిళంలో ‘నానుమ్‌ రౌడీదాన్‌' చిత్రంలో నటిస్తున్న నయనతార ఆ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడ్డట్లు గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరికీ రహస్యం వివాహం కూడా జరిగినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది.

Nayanthara reconverts to Christianity?

విఘ్నేష్ శివన్, నయనతార రహస్య వివాహం నిజంగానే జరిగిందా? లేదా? అనేదానిపై ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. తాజా నయనతార గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన తన పుట్టినరోజు నాడు ఇటలీలోని రోమ్‌ నగరంలో పోప్‌ సమక్షంలో ఆమె మళ్లీ క్రైస్తవ మతం స్వీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

విఘ్నేష్ శివన్ క్రైస్తవుడు కావడంతో ఆమె మళ్లీ క్రైస్తవం స్వీకరించినట్లు తమిళ సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. త్వరలోనే నయనతార, విఘ్నేష్ శివన తమ మధ్య ఉన్న బంధం గురించి బయట పెట్టబోతున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయం ఎటో ఒక వైపు తేలనుంది.

English summary
Last Wednesday (18th) Nayan celebrated her 31st birthday. To kick start the celebrations she went to an European tour, where she will spend her time in Milan, Italy. However, Nayan also visited Vatican City in Rome and got a glimpse of Pope too during the everyday where lakhs of tourists get a glimpse of the religious leader. This is however being spread as Nayan met Pope directly to convert into Christian fold again, while she has converted to Hinduism earlier though she is a Christian by birth.
Please Wait while comments are loading...