»   »  రెమ్యూనరేషన్: చుక్కలు చూపిస్తున్న నయనతార!

రెమ్యూనరేషన్: చుక్కలు చూపిస్తున్న నయనతార!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ ప్రియుడు ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నయనతార వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఆమె నటించిన సినిమాలన్నీ సక్సెస్ కావడంతో ఆఫర్లు కూడా బాగా పెరిగాయి. ఇటీవల ఆమె నటించిన మూడు సినిమాలు థాని ఒరువన్, మాయా, నానుమ్ రౌడీదాన్ సినిమాలు వరుస విజయాలు అందుకున్నాయి.

హాట్రిక్ సక్సెస్ తర్వాత నయనతారకు డిమాండ్ మరింత ఎక్కువైంది. పలువురు నిర్మాతలు, దర్శకులు ఆమెతో చేసేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో నయనతార రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో చిన్న సినిమాల నిర్మాతలు పక్కకు తప్పుకోగా... భారీ బడ్జెట్ తీసే నిర్మాతలు ఆమె అడిగిన మొత్తం చెల్లించి డేట్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

 Nayanthara remuneration Rs 3 cr?

రెమ్యూనరేషన్ విషయం పక్కన పెడితే... ఆమె గురించి మరో ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఆమె మళ్లీ మతం మారినట్లు టాక్. ప్రభుదేవా కోసం అప్పట్లో నయనతార క్రైస్తవం నుండి హిందూ మతంలోకి మారింది. సినిమాలను కూడా వదిలేద్దామని నిర్ణయించుకుంది. చివరి నిమిషంలో ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. తర్వాత నయనతార మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం, వరుసగా హిట్లు అందుకోవడంతో పాటు బిజీ హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే.

తమిళంలో ‘నానుమ్‌ రౌడీదాన్‌' చిత్రంలో నటిస్తున్న నయనతార ఆ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడ్డట్లు గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరికీ రహస్యం వివాహం కూడా జరిగినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన తన పుట్టినరోజు నాడు ఇటలీలోని రోమ్‌ నగరంలో పోప్‌ సమక్షంలో ఆమె మళ్లీ క్రైస్తవ మతం స్వీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విఘ్నేష్ శివన్ క్రైస్తవుడు కావడంతో ఆమె మళ్లీ క్రైస్తవం స్వీకరించినట్లు తమిళ సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

English summary
Three back to back hits in the form of Thani Oruvan, Maya and Naanum Rowdydhaan have given Nayanthara the much needed career break. If a report doing the rounds is anything to go by, then Nayanthara now charges Rs 3 cr per movie.
Please Wait while comments are loading...